IND vs ENG: ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ.. బద్దలైన లంక దిగ్గజం రికార్డ్..

గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 111 ఫోర్లను ఈ క్రమంలో బ్రేక్ చేశాడు. లెగ్-స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రోహిత్ రివర్స్-స్వీప్ ఆడి బౌండరీని సాధించే క్రమంలో ఈ ఫీట్ సాధించాడు.

IND vs ENG: ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ.. బద్దలైన లంక దిగ్గజం రికార్డ్..
అలాగే టీ20 ప్రపంచకప్‌లో 50 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో 31 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుతం రోహిత్ శర్మ 43 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.
Follow us

|

Updated on: Jun 27, 2024 | 10:26 PM

గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలు కొట్టాడు.

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 111 ఫోర్లను ఈ క్రమంలో బ్రేక్ చేశాడు. లెగ్-స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రోహిత్ రివర్స్-స్వీప్ ఆడి బౌండరీని సాధించే క్రమంలో ఈ ఫీట్ సాధించాడు.

37 ఏళ్ల అతను టోర్నమెంట్ చరిత్రలో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ తర్వాత రెండవ అత్యధికంగా సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

అన్ని T20Iలలో, ఈ ఫార్మాట్‌లో టాప్ ఫోర్-హిటర్స్ జాబితాలో రోహిత్ మూడవ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్‌లను వెనుకంజలో ఉంచాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్లు..

రోహిత్ శర్మ (భారత్) – 43 ఇన్నింగ్స్‌ల్లో 113* ఫోర్లు

మహేల జయవర్ధనే (శ్రీలంక) – 31 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫోర్లు

విరాట్ కోహ్లీ (భారత్) – 32 ఇన్నింగ్స్‌ల్లో 105 ఫోర్లు

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 41 ఇన్నింగ్స్‌ల్లో 103 ఫోర్లు

తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) – 34 ఇన్నింగ్స్‌ల్లో 101 ఫోర్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles