AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలితో ఏకాంతంగా పలాష్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీమిండియా ప్లేయర్..పెళ్లికి కొద్ది గంటల ముందు..?

ప్రస్తుతానికి పెళ్లి రద్దు కాలేదని, కేవలం వాయిదా పడిందని ఇరు కుటుంబాల వారు చెబుతున్నారు. అయితే, స్మృతి మంధాన పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించడం, పలాష్ పై వచ్చిన మోసం ఆరోపణలు, ఇద్దరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో, ఈ వివాదంపై పూర్తి స్పష్టత రావాలంటే స్మృతి మంధాన లేదా పలాష్ ముచ్ఛల్ స్వయంగా స్పందించాల్సి ఉంది.

ప్రియురాలితో ఏకాంతంగా పలాష్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీమిండియా ప్లేయర్..పెళ్లికి కొద్ది గంటల ముందు..?
Smriti Mandhana Palash Wedding
Venkata Chari
|

Updated on: Nov 27, 2025 | 5:54 PM

Share

భారత మహిళా క్రికెట్ స్టార్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాహం వాయిదా వెనుక స్మృతి తండ్రి అనారోగ్యంతో పాటు, వరుడు పలాష్‌పై వచ్చిన మోసం ఆరోపణలు, సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి.

పెళ్లి రోజునే తండ్రికి అస్వస్థత: అసలు కారణం ఇదే..

నవంబర్ 23, 2025న మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతి మంధాన-పలాష్ ముచ్ఛల్ వివాహం జరగాల్సి ఉంది. హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా పూర్తయ్యాయి. అయితే, ముహూర్తానికి కొద్ది గంటల ముందు ఊహించని సంఘటన జరిగింది.

స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అత్యవసర ఆరోగ్య పరిస్థితి కారణంగా, స్మృతి మంధాన తన తండ్రి ఆరోగ్యం కోలుకునే వరకు పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాకు ధృవీకరించారు.

కాబోయే మామ అనారోగ్యంతో బాధపడటం చూసి పలాష్ ముచ్ఛల్ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. పలాష్ తల్లి అమిత్ ముచ్ఛల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, పలాష్ తన మామగారితో బలమైన అనుబంధం కలిగి ఉన్నాడని, అందుకే ఆయన కోలుకునే వరకు పెళ్లి చేసుకోవడానికి పలాష్ నిరాకరించాడని తెలిపారు.

పెళ్లి పోస్టుల తొలగింపు, పుకార్ల హోరు..

వివాహం వాయిదా పడిన వెంటనే, సోషల్ మీడియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనితో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం వీడియోలు, ఫోటోలు, ఇతర పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించింది. ఆమె సహచర క్రీడాకారిణులు జెమీమా రోడ్రిగ్స్ వంటి వారు కూడా పెళ్లి వేడుకల వీడియోలను తొలగించారు.

మోసం ఆరోపణలు (లీక్ అయిన చాట్‌లు)..

ఈ తొలగింపుల తర్వాత, పలాష్ ముచ్ఛల్ ఒక మహిళ (కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా)తో చేసినట్లు ఆరోపణలు ఉన్న సీక్రెట్ చాటింగ్ స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. పెళ్లికి కొద్ది రోజుల ముందు పలాష్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండాలని కోరినట్లు ఈ చాట్‌లు సూచిస్తున్నాయి. ఈ విషయం తెలిసి, స్మృతి మంధాన కుటుంబంలో కలకలం రేగిందని, దాని వల్లే ఆమె తండ్రి అనారోగ్యానికి గురయ్యారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పలాష్ ముచ్చల్ పెళ్లి రోజునే స్మృతిని మోసం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడని, దీంతోనే పెళ్లి మండపం వద్ద గొడవ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు రోజు తన మాజీ ప్రియురాలితో పలాష్ ముచ్చల్ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా టీమిండియా మహిళ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందంట. ఈ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

ఈమేరకు రెడీట్‌లో ఓ పోస్ట్ సంచలనం రేపింది. స్మృతి, పలాష్ పెళ్ళి వాయిదా పడలేదని, శాశ్వతంగా ఆగిపోయిందని అందులో ఉంది. వివరాలకు ఆ పోస్ట్ చూడండి..

Palash Cheater Mucchal byu/teekhimirchy inBollyBlindsNGossip

కుటుంబ సభ్యుల స్పందన..

ఈ పుకార్లపై పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్ఛల్ స్పందిస్తూ, తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి ఆగిపోయిందని, ఈ సమయంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

స్పష్టత కోసం ఎదురుచూపులు..

ప్రస్తుతానికి పెళ్లి రద్దు కాలేదని, కేవలం వాయిదా పడిందని ఇరు కుటుంబాల వారు చెబుతున్నారు. అయితే, స్మృతి మంధాన పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించడం, పలాష్ పై వచ్చిన మోసం ఆరోపణలు, ఇద్దరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో, ఈ వివాదంపై పూర్తి స్పష్టత రావాలంటే స్మృతి మంధాన లేదా పలాష్ ముచ్ఛల్ స్వయంగా స్పందించాల్సి ఉంది.

అభిమానులు ఈ క్లిష్ట సమయంలో స్మృతి మంధానకు మద్దతుగా నిలుస్తూ, అనవసరమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us