Team India: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. టీమిండియా స్వ్కాడ్‌లో చేరిన గంభీర్ శిష్యుడు..
Jasprit Bumrah Ruled OUT: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టు నుంచి జస్ప్రీత్ బుమ్రాను తొలగించారు. బుమ్రా ఫిట్‌గా లేకపోవడంతో, తుది స్వ్కాడ్ నుంచి బుమ్రాను తప్పించారు. ఇటువంటి పరిస్థితిలో, హర్షిత్ రాణాను బుమ్రా స్థానంలో చేర్చారు. అలాగే ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్‌లను చేర్చారు.

Jasprit Bumrah Ruled OUT: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం టోర్నమెంట్‌కే దూరమయ్యాడు. బుమ్రా వెన్ను గాయం ఇంకా నయం కాకపోవడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. దీంతో బీసీసీఐ తన తుది జట్టును ప్రకటించింది. బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివం దూబే. అవసరమైతేనే ఈ ముగ్గురు ఆటగాళ్లు దుబాయ్ వెళతారు.
గాయంతో రెండో ఐసీసీ టోర్నీ ఆడని జస్సీ..
🚨 NEWS 🚨
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
— BCCI (@BCCI) February 11, 2025
గాయం కారణంగా బుమ్రా ఆడని రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. అంతకుముందు, అతను వెన్నునొప్పి కారణంగా 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆడలేకపోయాడు. ఈ కారణంగా అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది.
ముగిసిన తుది గడువు..
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎనిమిది జట్లు తమ ఫైనల్ స్వ్కాడ్‌ను సమర్పించడానికి ఫిబ్రవరి 11ని ఐసీసీ గడువుగా నిర్ణయించింది. ఆ తరువాత, ఏదైనా మార్పు కోసం చేయాలనుకుంటే ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలి. హర్షిత్ రాణా ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో వన్డే అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో రాణా తన వన్డే అరంగేట్రం చేశాడు. కొత్త బంతిని మహమ్మద్ షమీతో పంచుకున్నాడు. అద్భుతమైన ఆరంభం తర్వాత, ఫిల్ సాల్ట్‌ను తన మూడవ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. అయితే, ఈ ఢిల్లీ పేసర్ తిరిగి వచ్చి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచాడు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..