ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి మూడు రోజులు అద్భుత ప్రదర్శన చేసినా టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్, జానీ బెయిర్‌స్టో సెంచరీలు బాది టీమ్‌ఇండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.దీంతో 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న భారత జట్టు కల నెరవేరలేదు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ ఫ్లాప్ అని నిరూపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇంగ్లాండ్ క్రికెట్ విరాట్ కోహ్లీని ట్వీట్ ద్వారా ట్రోల్ చేసింది.
ఇంగ్లండ్ క్రికెట్ రెండు ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతుండడంతో విరాట్ కోహ్లీ సైలెంట్‌గా ఉండాలని సూచిస్తున్నాడు. రెండవ ఫొటోలో కోహ్లీని జానీ బెయిర్‌స్టోను కౌగిలించుకున్నాడు. ఈ ఫోటోపై, ECB మాట్లాడటం ఆపమన్నట్లు సూచించే ఎమోజీని పంచుకుంది.
— England Cricket (@englandcricket) July 5, 2022
బెయిర్‌స్టోతో కోహ్లీ..
విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోతో గొడవపడ్డాడు. విరాట్ కోహ్లీ, బెయిర్‌స్టోను స్లెడ్జ్ చేశాడు. అయితే, అతని పంతం టీమ్ ఇండియాపై సాగింది. బెయిర్‌స్టో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను గెలిపించాడు. బెయిర్‌స్టో సెంచరీ తర్వాత, విరాట్ కోహ్లీ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అతనిని ప్రశంసించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు.
కోహ్లిపై బెయిర్‌స్టోకు కోపం వచ్చిందా?
కోహ్లీ స్లెడ్జ్ తర్వాత, బెయిర్‌స్టో మ్యాచ్‌లో చాలా కోపంగా కనిపించాడు. అయితే మైదానం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అతను దానిని క్రికెట్‌లో భాగంగా పేర్కొన్నాడు. మ్యాచ్ సమయంలోనే ఇదంతా జరుగుతుందని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. కోహ్లి చాలా మంచి క్రికెట్ ఆడతాడంటూ పేర్కొన్నాడు.