AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నాయకుడిగా మారిన కోహ్లీ.. ప్రాక్టీస్ సెషన్‌లో మోటివేషనల్ స్పీచ్..

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. ఇక్కడ జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ఆతిథ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన సిరీస్‌లో ఈ మ్యాచ్ భాగంగా జరగనుంది.

Watch Video: నాయకుడిగా మారిన కోహ్లీ.. ప్రాక్టీస్ సెషన్‌లో మోటివేషనల్ స్పీచ్..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Jun 22, 2022 | 11:48 AM

Share

విరాట్ కోహ్లీ ఇకపై టీమిండియా కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. కానీ, అతనిలోని నాయకుడిని మాత్రం ఎవరూ తొలగించలేరు. ఇది మరోసారి రుజువైంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఈ సీన్ కనిపించింది. ఈమేరకు లిస్టర్ కౌంటీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో విరాట్ తోటి ఆటగాళ్లకు ప్రేరణనిస్తూ.. వారితో ప్రసంగం చేస్తూ కనిపించాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. ఇక్కడ జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ఆతిథ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన సిరీస్‌లో ఈ మ్యాచ్ భాగంగా జరగనుంది. అంతకుముందు జూన్ 24 నుంచి జూన్ 27 వరకు లీసెస్టర్‌లోని గ్రేస్ రోడ్‌లో జరిగే సన్నాహక మ్యాచ్‌లో భారత జట్టు కౌంటీతో తలపడుతుంది. ఈమేరకు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈమేరకు ఆటగాళ్లకు తన విలువైన సూచనలు ఇస్తూ కనిపించాడు. ఈమేరకు ఫ్యాన్స్ కూడా దటీజ్ కోహ్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జట్టుతో చేరిన కోచ్ రాహుల్ ద్రవిడ్..

ఇవి కూడా చదవండి

టీమిండియా జట్టుతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మంగళవారం జట్టులో చేరాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. తొలి టెస్టు వ్యూహంపై ఆటగాళ్లతో ద్రవిడ్ చర్చించాడు. దీని తర్వాత టీమ్ ఇండియా స్టార్లు వేర్వేరుగా ప్రాక్టీస్ పూర్తి చేశారు.

సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1 ఆధిక్యం..

గత ఏడాది నాలుగు టెస్టు మ్యాచ్‌ల తర్వాత, కరోనా కారణంగా భారత్-ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా వేయవలసి వచ్చింది. అప్పటికి భారత జట్టు 2-1తో ముందంజలో ఉంది. తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత రెండో, నాలుగో టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

మారిన ఇరు జట్ల కెప్టెన్లు..

గత భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించారు. కాగా, ప్రస్తుతం ఇరు జట్ల కెప్టెన్లను మారారు. భారత్ కమాండ్ రోహిత్ శర్మ చేతిలో ఉండగా, ఇంగ్లండ్ పగ్గాలు బెన్ స్టోక్స్ చెంత ఉన్నాయి.