India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌లో సత్తా చాటేందుకు రెడీ..!
Prasidh Krishna: న్యూజిలాండ్‌తో టెస్టు జట్టులో ఈ ఆటగాడిని హఠాత్తుగా ఎంపిక చేయలేదు. ఇప్పటికే సెలెక్టర్ల మదిలో ఈ బౌలర్ ఉన్నాడు. అంతర్జాతీయ అరంగేట్రంలోనే 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
India Vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగే భారత టెస్టు జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా కొందరు ఆటగాళ్లకు తొలిసారిగా టెస్టు జట్టులో అవకాశం దక్కింది. ఆ కొద్ది మంది ఆటగాళ్లలో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కూడా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు రైట్‌ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ టెస్ట్ జట్టులో ఎంపికైన తర్వాత తన అనుభూతిని పంచుకున్నాడు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్‌లోని పెద్ద ఆటగాళ్లతో మైదానం పంచుకునే అవకాశం దొరికింది. వారి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించనుంది’ అని తెలిపాడు.
తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ప్రసీద్ధ్ కృష్ణ.. భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం ఇచ్చాడు. వన్డే అరంగేట్రంలోనే 4 వికెట్లు పడగొట్టి, భారత జట్టు 66 పరుగుల విజయానికి దోహదం చేసి 24 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దీంతో కృష్ణను టెస్టు జట్టులో ఎంపిక చేయడం అకస్మాత్తుగా అయితే జరగలేదు. అతను చాలా కాలం పాటు సెలెక్టర్ల మదిలోనే ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన నాల్గవ టెస్టుకు స్టాండ్‌బై బౌలర్‌గా కూడా ఉన్నాడు. ఇది కాకుండా, అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఉన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనతో మెరుగయ్యాడు.. 2015లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన ప్రసీద్ధ్.. ఇంగ్లండ్ పర్యటన తనకు మెరుగైన ఆటగాడిగా మారడానికి దోహదపడిందని తెలిపాడు. ‘ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడం చాలా సవాలుతో కూడుకుంది, అలాంటి పరిస్థితిలో నేర్చుకోవలసినది చాలా ఉంది. ఆ పర్యటన తర్వాత నా ఆత్మవిశ్వాసం పెరిగి.. నా ఆట స్థాయి కూడా పెరిగిందని భావిస్తున్నాను. ఇంగ్లండ్‌లో బౌలింగ్ నా నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, ప్రదర్శనలో నిలకడను చూపించింది. ఆ పర్యటన నాలోని ఎక్స్ ఫ్యాక్టర్‌ని బయటకు తీసుకొచ్చింది. అలాగే ఒత్తిడిని తట్టుకునేలా బలంగా తయారుచేసిందని’ పేర్కొన్నాడు.