India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు

Jaydev Unadkat: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ కౌంటర్‌గా ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు
Jaydev Unadkat
Follow us
Venkata Chari

|

Updated on: Nov 13, 2021 | 10:07 AM

Jaydev Unadkat: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. అయితే 30 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు జట్టులో చోటు దక్కలేదు. ఉనద్కత్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు. అయినా అతని పేరును మాత్రం సెలక్టర్లు విస్మరిస్తున్నారు. దీంతో సహనం నశించిన జయదేవ్ సోషల్ మీడియాలో తన స్వరం పెంచాడు.

రంజీ ట్రోఫీ సీజన్ 2019-20లో జయదేవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. జయదేవ్ ఉనద్కత్ 10 మ్యాచ్‌లలో 13.23 సగటుతో 67 వికెట్లు పడగొట్టాడు. దీంతో జయదేవ్ టీం మొదటి రంజీ టైటిల్‌ను గెలుచుకుంది. అదే సమయంలో ప్రస్తుతం ఆడుతున్న సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలోనూ అద్భుత ఆటను కనబరిచాడు. తన బ్యాటింగ్ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. ఆ తర్వాత అభిమానులు జయదేవ్‌ను హార్దిక్ పాండ్యాతో పోల్చడం ప్రారంభించారు.

బీసీసీఐని టార్గెట్ చేసిన ఉనద్కత్.. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉనద్కత్ 32 బంతుల్లో 58 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ సిరాజ్ వంటి అత్యుత్తమ బౌలర్లకు వ్యతిరేకంగా అతను తన వేగవంతమైన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడు. తన బ్యాటింగ్‌కి సంబంధించిన ఈ వీడియోను షేర్ చేస్తూ, ‘మరో ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ కూడా చేయగలడు’ అని క్యాప్షన్‌లో రాశాడు. దీంతో అభిమానులు అతడిని హార్దిక్ పాండ్యాతో పోల్చారు. ‘హార్దిక్ పాండ్యా నుంచి కూడా గొప్ప షాట్’ అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. ‘అందరూ బీసీసీఐ సెలెక్టర్లను ట్రోల్ చేస్తారు’ అని మరొక యూజర్ పేర్కొన్నాడు. ‘హార్దిక్ పాండ్యా కంటే మీరు మంచి ఆల్ రౌండర్’ అంటూ మరో అభిమాని పొగడ్తలతో ముంచెత్తాడు.

టీ20 జట్టు ప్రకటన.. టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ కొత్త ముఖాలు జట్టులోకి రానున్నాయి. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. నవంబర్ 17 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ 17న, రెండో మ్యాచ్ 19న, మూడో మ్యాచ్ నవంబర్ 21న జరగనుంది. టీ20 సిరీస్‌లో నలుగురు వెటరన్‌లకు విశ్రాంతినిచ్చారు. ఇందులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఉన్నారు. వీరితో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులోకి ఎంపిక కాలేదు.

Also Read: Exclusive: ఆ ఇద్దరి ఎంపిక ‘ఫ్యూచర్ ప్లానింగ్’లో భాగమేనా.. విహారి, పృథ్వీ షాలను దక్షిణాఫ్రికా పంపనున్నది అందుకునే?

Womens Cricket: న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Hockey India: మరోసారి టీమిండియాను ఛాంపియన్‌ చేస్తాం.. సరికొత్త వ్యూహాలతో బరిలోకి: వివేక్ సాగర్