Asia Cup: వన్డే కెరీర్‌కు గుడ్‌బై.. ఆసియా కప్ స్వ్కాడ్ దెబ్బకు.. రిటైర్మెంట్ బాటలో ఐదుగురు ఆటగాళ్లు..
India Asia Cup Squad: ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్‌లతో సహా కొంతమంది కీలక ఆటగాళ్లకు చోటు లభించలేదు. దీంతో టీమిండియా స్వ్కాడ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఫాంలో ఉన్న ఆటగాళ్లకు ఆసియా కప్ 2023 స్వ్కాడ్‌లో చోటుదక్కలేకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

India’s Asia Cup Squad: భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లకు జట్టులో స్థానం ఖరారైంది. ఇది కాకుండా, కొంతమంది కీలక ఆటగాళ్ళు ఫిట్‌గా మారి రీఎంట్రీ చేయడం కనిపిస్తుంది. అయితే ఈ జట్టులో అశ్విన్, చాహల్ సహా కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. ఈ జట్టులో స్థానం సంపాదించడానికి అర్హులైన ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1 – యుజ్వేంద్ర చాహల్: టీమిండియా ఆసియా కప్ జట్టులో వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లేదు. ఈ ఏడాది కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడిన చాహల్.. గతేడాది జట్టు తరపున 10కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో, శ్రీలంకలో అనుకూలమైన స్పిన్ పిచ్‌లను చూస్తుంటే, అతను మ్యాచ్ విన్నర్ ఆటగాడిగా నిరూపించుకోవచ్చు. కానీ, అతన్ని జట్టులోకి తీసుకోలేదు.
2 – శిఖర్ ధావన్: భారత జట్టు అనుభవజ్ఞుడైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఆసియా కప్ జట్టులో లేకపోవడంపై పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేనప్పటికీ, అతన్ని జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ధావన్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతను జట్టులో చోటు దక్కించుకోవడానికి అర్హుడు. శిఖర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని 2022 డిసెంబర్‌లో ఆడాడు. అప్పటి నుంచి అతడిని టీమ్ ఇండియాలో చేర్చలేదు.




3 – రవిచంద్రన్ అశ్విన్: 2022 సంవత్సరానికి జట్టులో భాగమైన అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసియా కప్ జట్టులో భాగమని భావించారు. అతని బ్యాటింగ్ ప్రతిభ కారణంగా అక్షర్ పటేల్ ఈ రేసులో అతనిని అధిగమించాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అశ్విన్ పరిమిత ఓవర్ల కెరీర్ దాదాపు ముగిసినట్లే.
4 – భువనేశ్వర్ కుమార్: ఒకప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించిన భువనేశ్వర్ కుమార్.. అంతర్జాతీయ కెరీర్ ఇప్పుడు దాదాపు ముగిసినట్లే. భువనేశ్వర్ తన చివరి వన్డేను 2022 సంవత్సరం ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. అప్పటి నుంచి అతనికి 50 ఓవర్ల ఫార్మాట్‌లో జట్టులో అవకాశం రాలేదు.
5 – సంజు శాంసన్: ఆసియా కప్‌నకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించినప్పుడు.. అందులో సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో శాంసన్ రికార్డు, ఫామ్ ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడంపై కచ్చితంగా పెద్ద ప్రశ్నే తలెత్తింది. శాంసన్ రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో కలిసి వెళ్లనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
