- Telugu News Sports News Cricket news IND vs WI Team India Create Records in 4th t20i against west indies in Florida
IND vs WI: 9 వికెట్ల తేడాతో ఘన విజయం.. టీమిండియా ఖాతాలో చేరిన భారీ రికార్డులు..
IND vs WI: వరుసగా రెండు టీ20లను గెలిచిన భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆగస్టు 13 ఆదివారం జరిగే నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రత్యేక రికార్డులు సృష్టించింది. అలాగే యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ కూడా ప్రత్యేక రికార్డులో చేరారు.
Updated on: Aug 13, 2023 | 3:09 PM

ఆగస్టు 12వ తేదీ శనివారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఉంటే, సరిగ్గా 7 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను ఓడిపోయి ఉండేది. అయితే దీనికి టీం ఇండియా ఆటగాళ్లు అనుమతించలేదు.

వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆగస్టు 13 ఆదివారం జరిగే నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రత్యేక రికార్డులు సృష్టించింది.

వెస్టిండీస్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన భారత్, ఈ విజయంతో ఫ్లోరిడాలోని ఈ మైదానంలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌గా రికార్డు సృష్టించింది.

అలాగే ఫ్లోరిడాలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన భారత్.. అందులో ఐదింటిలో విజయం సాధించి, ఈ మైదానంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది.

4వ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ తరపున T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదు చేశారు. అంతకుముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

యశస్వీ జైస్వాల్ (84 నాటౌట్) 20 ఏళ్ల 227 రోజుల అతి పిన్న వయసులో తన తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

150కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి వికెట్ నష్టపోకుండా లేదా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి టీమ్ ఇండియా సాధించిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే.





























