- Telugu News Photo Gallery Cricket photos Yashasvi Jaiswal becomes 4th Youngest Indian player to score T20I half century
IND vs WI: మొన్న తిలక్, నిన్న జైస్వాల్.. ఆరంగేట్ర సిరీస్‌లోనే అరుదైన రికార్డులు సృష్టించిన కుర్రాళ్లు.. వివరాలివే..
IND vs WI 4th T20I: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 4వ టెస్టులో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ తరఫున శుభమాన్ గిల్ 77 పరుగులతో రాణించగా, యశస్వీ జైస్వాల్ అజేయమైన 84 పరుగులతో ఆకర్షించాడు. అయితే ఆరంగేట్ర హాఫ్ సెంచరీ సాధించిన యశస్వీ ఓ అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. విశేషమేమిటంటే.. యశస్వీ సాధించిన ఇదే రికార్డుని ఇదే సిరీస్‌లో మరో ఆరంగేట్ర ఆటగాడైన తిలక్ వర్మ కూడా నమోదు చేశాడు
Updated on: Aug 13, 2023 | 3:15 PM

IND vs WI: వెస్టిండీస్‌తో శనివారం జరిగిన 4వ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర హాఫ్ సెంచరీతో రాణించాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన నాల్గో పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు.

ఇదే సిరీస్‌తో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ కూడా ఆరంగేట్ర హాఫ్ సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు.

మొత్తానికి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 20 ఏళ్ల 143 రోజుల వయసులో రోహిత్ శర్మ 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు.

అలాగే తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజుల వయసులో.. వెస్టిండీస్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో తన టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఇంకా 21 ఏళ్ల 38 రోజుల వయసులో తొలి టీ20 నమోదు చేసిన రిషభ్ పంత్.. ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.

తాజాగా శనివారం జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా 21 ఏళ్ల 227 రోజుల వయసులో యశస్వీ.. తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఇలా నాల్గో స్థానంలో నిలిచాడు. .





























