- Telugu News Photo Gallery Cricket photos CPL 2023: Ambati Rayudu signs up for St Kitts and Nevis Patriots In Caribbean Premier League
Ambati Rayudu: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న తెలుగు తేజం
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించివీడ్కోలు పలికిన రాయుడు, సీపీఎల్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున ఆడనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, రాయుడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు మార్క్యూ ప్లేయర్‌గా సంతకం చేశాడు.
Updated on: Aug 13, 2023 | 9:40 AM

టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించివీడ్కోలు పలికిన రాయుడు, సీపీఎల్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున ఆడనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, రాయుడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు మార్క్యూ ప్లేయర్‌గా సంతకం చేశాడు. కాబట్టి రాబోయే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అంబటి రాయుడు కనిపిస్తాడని తెలుస్తోంది.

ఐపీఎల్ 2023కి వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ఆ తర్వాత యూఎస్ వేదికగా జరిగే మేజర్ క్రికెట్ లీగ్‌లో కనిపించాలనుకున్నాడు. అంతే కాకుండా, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో CSK ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే రిటైర్మెంట్ తర్వాత భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనకుండా నిరోధించడానికి కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని BCCI తెలిపింది. దీంతో మేజర్ క్రికెట్ లీగ్ నుంచి రాయుడు వైదొలిగాడు.

అయితే ఇప్పుడు బీసీసీఐ అలాంటి కొత్త రూల్ ఏదీ అమలు చేయలేదు. తద్వారా కరీబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు అంబటి రాయుడు సిద్ధమయ్యాడని తెలిసింది. ఒకవేళ అంబటి రాయుడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున ఆడితే, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన 2వ భారత ఆటగాడు అవుతాడు.

గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు అంబటి రాయుడు కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్ వైపు మొగ్గు చూపాడు.





























