India Playing XI: ముగ్గురు భారత ప్లేయర్లకు బ్యాడ్ న్యూస్.. చివరి పోరులో నో ఛాన్స్.. గెలిచినోళ్లదే టీ20 సిరీస్..

India Playing XI 5th T20I: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ 2-2తో సమమైంది. తద్వారా చివరి T20I మ్యాచ్ చివరి పోరుగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం సిరీస్‌ 2-2తో సమం కావడంతో చివరి టీ20 మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేసే అవకాశం లేకపోలేదు.

India Playing XI: ముగ్గురు భారత ప్లేయర్లకు బ్యాడ్ న్యూస్.. చివరి పోరులో నో ఛాన్స్.. గెలిచినోళ్లదే టీ20 సిరీస్..
Ind Vs Wi 5th T20i
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2023 | 4:03 PM

భారత్ వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) మధ్య నేడు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలుపొందగా 3వ, 4వ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.

ప్రస్తుతం సిరీస్‌ 2-2తో సమం కావడంతో చివరి టీ20 మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేసే అవకాశం లేకపోలేదు.

జైస్వాల్ అద్బుత ఇన్నింగ్స్..

ఎందుకంటే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌లు తర్వాత మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈ మార్పు తర్వాత టీమ్ ఇండియా వరుసగా 2 విజయాలు నమోదు చేసింది.

అందుకే 5వ టీ20 మ్యాచ్‌లోనూ గెలిచిన జట్టును కొనసాగించాలని హార్దిక్ పాండ్యా భావిస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లోనూ ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు బెంచ్‌పై వేచి ఉండనున్నారు.

అదరగొట్టిన యశస్వీ జైస్వాల్..

మూడు, నాలుగో టీ20 మ్యాచ్‌ల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఇషాన్ కిషన్‌కు బదులుగా యశస్వీ జైస్వాల్‌ని రంగంలోకి దించారు. 3వ మ్యాచ్‌లో ఆరంభంలోనే ఔటైన యశస్వీ.. 4వ మ్యాచ్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జైస్వాల్ 3 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. ఈ ఙన్నింగ్స్‌తో జైస్వాల్ చివరి టీ20 మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 5 టీ20..

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్.. 4వ టీ20 మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. టీమిండియాకు కీలకమైన ఈ మ్యాచ్‌లో గిల్ 47 బంతులు ఎదుర్కొని 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. తద్వారా గిల్ స్థానం కూడా ఖాయంగా మారింది. దీని ప్రకారం టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

టీమిండియా ఆటగాళ్ల మీటింగ్..

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11

1. శుభమాన్ గిల్

2. యశస్వీ జైస్వాల్

3. సూర్యకుమార్ యాదవ్

4. తిలక్ వర్మ

5. హార్దిక్ పాండ్యా

6. సంజు శాంసన్

7. అక్షర్ పటేల్

8. కుల్దీప్ యాదవ్

9. అర్ష్దీప్ సింగ్

10. ముఖేష్ కుమార్

11. యుజువేంద్ర చాహల్.

భారత టీ20 జట్టు:

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

హాకీ టీంకు శుభాకాంక్షలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!