AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban Promises: మీకేంకాదు.. మేమున్నాం.. క్రికెట్ జట్టుకు భరోసా ఇచ్చిన తాలిబన్లు.. జట్టు సభ్యులతో స్పెషల్ మీటింగ్..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు నియంత్రణలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి క్షీణించింది. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తుండగా.. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. జట్టు కీలక ఆటగాడు రషీద్ ఖాన్ ఇంగ్లాండ్ నుండి దేశంలో...

Taliban Promises: మీకేంకాదు.. మేమున్నాం.. క్రికెట్ జట్టుకు భరోసా ఇచ్చిన తాలిబన్లు.. జట్టు సభ్యులతో స్పెషల్ మీటింగ్..
Taliban Representatives
Sanjay Kasula
|

Updated on: Aug 22, 2021 | 7:11 PM

Share

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు నియంత్రణలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి క్షీణించింది. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తుండగా.. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. జట్టు కీలక ఆటగాడు రషీద్ ఖాన్ ఇంగ్లాండ్ నుండి దేశంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. అలాగే, రాబోయే టి 20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుందా..లేదా? ఈ ప్రశ్న మొదలైంది. అయితే క్రికెట్ జట్టులో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు తాలిబాన్లు. తాలిబాన్ సీనియర్ అధికారి ఆఫ్ఘన్ క్రికెటర్లతో ప్రత్యకంగా సమావేశమయ్యారు. అతను దేశ క్రికెట్‌కు పూర్తిగా మద్దతు ఇస్తారని చెప్పారు.

అరియానా న్యూస్ అందించిన సమాచారం ప్రకారం, తాలిబాన్ నాయకుడు అనాస్ హక్కానీ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా , నూర్ అలీ జద్రాన్‌లను కలిశారు. “1996 నుండి 2001 వరకు అతని అధ్యక్షతనే దేశంలో క్రికెట్ ప్రారంభమైంది. మేము ఎల్లప్పుడూ క్రికెట్‌కు మద్దతు ఇస్తున్నాము” అని అతను ప్రకటించాడు.

ఆటగాళ్ల సమస్యలు త్వరలో పరిష్కరం

” ఎల్లప్పుడూ దేశ క్రికెటర్లకు తాలిబాన్లు మద్దతు ఉంటుంది ” అని హక్కానీ అన్నారు. వారి సమస్యలకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. ఇంతలో, ఈ సందర్భంగా హాజరైన క్రికెటర్లు హక్కానీ.. అతని సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. తాలిబాన్లు దేశంలో క్రికెట్‌కు మద్దతునిస్తూనే ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

న్యూజిలాండ్, పాకిస్తాన్ పర్యటన

సెప్టెంబర్ 11 న న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుంటుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు మరియు 5 టీ 20 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ అక్టోబర్ 3 వరకు రావల్పిండి,  లాహోర్ మైదానంలో జరుగుతాయి. ఈ పర్యటనలో మ్యాచ్ న్యూజిలాండ్ , పాకిస్తాన్ రాబోయే టి 20 ప్రపంచ కప్ కోసం ప్రాక్టీస్ చేయడానికి రెడీ అవుతోంది. 19 ఏళ్ల తర్వాత తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది.

న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లాండ్, పాకిస్తాన్‌ పర్యటన

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన తర్వాత పాకిస్తాన్ చేరుకుంటుంది. ఇంగ్లాండ్ యొక్క పురుషులు, మహిళల జట్లు ఈసారి పర్యటనలో ఉన్నాయి. ఈసారి పురుషుల జట్టు 2 టీ 20 సిరీస్‌లు ఆడనుంది. 2005 తర్వాత పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ పర్యటన ఇదే మొదటిసారి..

పాకిస్తాన్ క్రికెట్‌పై తాలిబన్ ఎఫెక్ట్..

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితితులు పొరుగున ఉన్న పాకిస్తాన్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వీటన్నింటి కారణంగా ఇబ్బందుల్లో పడింది. రాబోయే రోజుల్లో ముఖ్యమైన జట్లు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనలో భద్రతా సమస్యను లేవనెత్తే ఛాన్స్ ఉంది. ఇంతలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు ఎహసాన్ మణి మాట్లాడుతూ.. పాకిస్తాన్ పర్యటనకు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఖచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తి చేశారు.

ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …

CA Exams 2021: ఫైనల్, ఇంటర్ పాత కోర్సు పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్.. చివరి ప్రయత్నంగా మరో అవకాశం..