Siraj Cutout: సిరాజ్ సక్సెస్‌ను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న హైదరాబాదీ ఫ్యాన్స్.. వైరల్ అవుతోన్న కటవుట్ ఫొటో.
Siraj Cutout: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే...
Siraj Cutout: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇక మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించి వారిలో మన హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యంగ్ ప్లేయర్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 8 వికెట్లతో సంచలనం సృస్టించింది. దీంతో తమ అభిమాన క్రికెటర్‌కి హైదరాబాదీ ఫ్యాన్స్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
సాధారణంగా సినిమా హీరోలకు, రాజకీయనాయకులకు మాత్రమే పరిమితమైన భారీ కటౌట్‌ను సీరాజ్ కోసం ఏర్పాటు చేశారు. నోటిపై వేలు వేసుకున్నట్లు ఉన్న సిరాజ్ ఫొటోను భారీ కటౌట్‌గా ఏర్పాటు చేసి పూల దండలతో హంగామా చేశారు ఫ్యాన్స్. ఇక సిరాజ్ కటౌట్‌ను నోటిపై వేలు వేసుకున్నట్లు డిజైన్ చేయడానికి ఓ కారణమం ఉందండోయ్. వికెట్ తీసిన ప్రతీసారి సిరాజ్.. ఏం మాట్లాడొద్దు అన్నట్లు సైగల్ చేస్తూ స్టేడియంలో హంగామా చేయడమే దీనికి కారణం. ఇక సిరాజ్ అభిమానులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘సిరాజ్ సూపర్ స్టార్. అందరూ క్రికెట్ ఫ్యాన్స్ తరఫున నీకు ప్రేమను అందిస్తున్నాం’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. క్రికెట్‌కు భారత్‌లో ఉండే అభిమానం ఇలాంటిది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 25 నుంచి ప్రారంభమవనున్న విషయం తెలిసిందే.
వైరల్ అవుతోన్న సిరాజ్ కటౌట్ ఫొటో..
Siraj is a Superstar, Miyan getting all the love from the cricket fans. pic.twitter.com/aKG9l00181
— Johns. (@CricCrazyJohns) August 19, 2021
Viral Photo: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..
అమెరికా దళాల అధీనంలో కాబూల్ విమానాశ్రయం.. రోజుకు భారత్ నుంచి రెండు విమాన సర్వీసులకు అనుమతి