AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్.. ఒకరు ఓపెనర్‌ అయితే మరొకరు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్

Cricket News: ఒకే మ్యాచ్‌ ద్వారా చాలామంది క్రికెటర్లు కెరీర్ ప్రారంభించడం మనం చూశాం. కానీ ఒకే మ్యాచ్‌లో

ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్.. ఒకరు ఓపెనర్‌ అయితే మరొకరు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్
Victoria
uppula Raju
|

Updated on: Aug 23, 2021 | 3:41 PM

Share

Cricket News: ఒకే మ్యాచ్‌ ద్వారా చాలామంది క్రికెటర్లు కెరీర్ ప్రారంభించడం మనం చూశాం. కానీ ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం చూశారా..! అవును ఇది జరిగింది. సరిగ్గా ఇదే రోజున ఇంగ్లాండ్‌లో చారిత్రాత్మక విజయం ద్వారా ఇద్దరు అనుభవజ్ఞులైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా జట్టు విజయంతో వారికి వీడ్కోలు పలికింది. ఆ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈ రోజు అంటే ఆగస్టు 23 న రిటైర్మెంట్ తీసుకున్నారు. వారిలో ఒకరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మరొకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్.

2015, ఆగస్టు 23 న ఆస్ట్రేలియన్ అనుభవజ్ఞులు మైఖేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ తమ టెస్ట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ మైదానంలో ఆగస్టు 20 నుంచి 23 వరకు జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 481 పరుగులు చేసింది. ఇందులో స్టీవ్ స్మిత్ 143 పరుగుల అద్భుతమైన సెంచరీ, డేవిడ్ వార్నర్ 85, ఆడమ్ వోగ్స్ 76 పరుగులు అందించారు. మిచెల్ స్టార్క్ 58 పరుగులు చేశాడు. క్రిస్ రోజర్స్ 43 పరుగులు సాధించాడు. కానీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్, స్టీవెన్ ఫిన్, మోయిన్ అలీ 3 వికెట్ల చొప్పున సాధించారు.

తర్వాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలిపోయింది. జట్టు కోసం మొయిన్ అలీ గరిష్టంగా 30 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ జాన్సన్, మిచెల్ మార్ష్ తలో మూడు వికెట్లు తీసుకోగా, నాథన్ లియాన్, పీటర్ సిడిల్ తలో రెండు వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌కు ఫాలో-ఆన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతాలు చేయలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ అలెస్టర్ కుక్ 85 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మోయిన్ అలీ 35 పరుగులు అందించాడు. ఈసారి ఆస్ట్రేలియా తరఫున పీటర్ సిడిల్ అత్యధికంగా నాలుగు వికెట్లు సాధించాడు.

క్లార్క్, రోజర్స్ టెస్ట్ కెరీర్ మ్యాచ్ ముగియడంతో క్లార్క్, రోజర్స్ టెస్ట్ కెరీర్లు కూడా ముగిశాయి. క్లార్క్ 115 టెస్టుల్లో 49.10 సగటుతో 28 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సహాయంతో 8643 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 329 పరుగులు. రోజర్స్ 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు అందులో అతను 42.87 సగటుతో 2015 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 5 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు వచ్చాయి. అత్యధిక స్కోరు 173 పరుగులు.

Mekathoti Sucharitha: టీడీపీ నేత నారా లోకేష్‌కు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నాస్త్రాలు