IND vs ENG: నువ్వా- నేనా? టీ20 వరల్డ్ కప్‌లో నేడు మరో బిగ్ ఫైట్.. టీమిండియా కూర్పు ఎలా ఉండనుందంటే?
సెమీస్ లో స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు అవకాశం ఉంది. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న ప్రెస్‌మీట్లో రోహిత్ ఓ హింట్ ఇచ్చాడు. ఇద్దరు కీపర్లనూ బరిలో దించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నాడు.
2007 తర్వాత భారత్ మరో టీ20 ప్రపంచకప్ గెలవలేకపోయింది. దీనికి అనేక కారణాలున్నాయి. కానీ ఈసారి మాత్రం జట్టు పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలోనూ అద్భుతంగా కనిపిస్తోంది. బుమ్రా లేడన్న లోటే గాని.. అర్ష్‌దీప్, భువి, షమీ ఆ లోటును పూరిస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టుకు ఈరోజు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. ఆదివారం పాక్‌తో జరిగే ఫైనల్ ఎవరు ఆడాలో ఈరోజు తేలిపోనుంది. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన గత నాలుగు టి20 సిరీస్‌లను కూడా భారతే గెలిచింది. ఇందులో రెండు భారత్‌లో జరగ్గా, మరో రెండు ఇంగ్లండ్‌లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం భారీగానే ఉంది. మరి టీమిండియా ఫైనల్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది? మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఒక మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్‌లో కార్తీక్‌కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్‌లో కూడా ఈ విషయంలోనే టీమ్ తటపటాయిస్తోంది. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ అశ్విన్, అక్షర్‌లను రెగ్యులర్‌గా ఆడిస్తున్నారు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న ప్రెస్‌మీట్లో రోహిత్ ఓ హింట్ ఇచ్చాడు. ఇద్దరు కీపర్లనూ బరిలో దించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నాడు.
సమష్ఠిగా రాణిస్తేనే..
ఇక టోర్నమెంట్ టాప్ స్కోరర్ కోహ్లి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అతనికి తోడుగా అగ్నిలా సూర్యకుమార్ దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోతున్నాడు. రాహుల్ కూడా కుదురుకున్నాడు, రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కొంత ఇబ్బంది పెడుతోంది. 5 మ్యాచ్‌లలో కలిపి 89 పరుగులే చేసిన రోహిత్ ఎప్పుడు చెలరేగుతాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ముగ్గురు పేసర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటం మనకు ప్లస్ అవుతోంది. భువీ బౌలింగ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 30 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు అవుట్ అయ్యాడంటే ఆరంభంలో పైచేయి చూపించేందుకు భారత్‌కు మరో అవకాశం ఉంది.
మలాన్, మార్క్‌వుడ్ డౌట్!
ఇక ఇంగ్లండ్ టీమ్‌లో స్టోక్స్, వోక్స్, స్యామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్… అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల సమర్థలు. అంతేకాదు.. బ్యాటింగ్‌లో చెలరేగే సత్తా వీరికుంది. ఇంగ్లండ్ గెలుపోటములు వీరి ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత స్యామ్ కరన్ రాటుదేలాడు. ఇలాంటి నాకౌట్స్‌లో స్టోక్స్ పవర్ ఏంటో ఇంతకముందే చూశాం. ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ చెలరేగకుండా మనోళ్లు చూస్తే మ్యాచ్ మనవైపే ఉంటుంది. హేల్స్ టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతుండగా, బట్లర్ అసలు సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్ కీలకం కాగా, మలాన్ రూపంలో మరో కీలక బ్యాటర్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న మలాన్ కోలుకోకపోతే సాల్ట్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో కూడా జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న మార్క్ వుడ్ కూడా గాయపడి కోలుకోలేదు. అతను ఆడలేకపోతే జోర్డాన్‌కు అవకాశం దక్కుతుంది.
India and England meet at Adelaide Oval with a place in the Final on the line ?
Which team wins to set up a clash with Pakistan?#T20WorldCup | #INDvENG pic.twitter.com/8jnSrI60ST
— T20 World Cup (@T20WorldCup) November 10, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..