Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌పై వ్లాగ్.. యూట్యూబర్‌ను కాల్చి చంపిన కరాచీ భద్రతా సిబ్బంది

అమెరికాలో క్రికెట్‌కు ఆదరణను పెంచడానికి, ICC ఈసారి T20 ప్రపంచ కప్ USA-వెస్టిండీస్‌లలో సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పోరును ఈసారి న్యూయార్క్‌లో నిర్వహించారు. అయితే ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది.

T20 World Cup 2024: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌పై వ్లాగ్.. యూట్యూబర్‌ను కాల్చి చంపిన కరాచీ భద్రతా సిబ్బంది
Ind Vs Pak Match
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2024 | 7:59 PM

అమెరికాలో క్రికెట్‌కు ఆదరణను పెంచడానికి, ICC ఈసారి T20 ప్రపంచ కప్ USA-వెస్టిండీస్‌లలో సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పోరును ఈసారి న్యూయార్క్‌లో నిర్వహించారు. అయితే ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ఒక ఫేమస్ యూట్యూబర్‌ని కరాచీ భద్రతా సిబ్బంది చంపేశారు. ఆదివారం భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు ముందు, సాద్ అహ్మద్ అనే వ్లాగర్ కరాచీలోని ప్రధాన మొబైల్ మార్కెట్‌కి వెళ్లారు. అందరితో మాట్లాడుతుండగా క్రికెట్ వీడియో తీస్తున్న సాద్ కు సెక్యూరిటీ గార్డు ఎదురయ్యాడు.అదే సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి భద్రతా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కానీ ఈసారి అతను వ్లాగ్‌లో కనిపించడానికి నిరాకరించాడు. అయితే పదే పదే ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడైన సెక్యూరిటీ గార్డు సాద్ అహ్మద్ తో వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్తా పెద్దది కావడంతో సెక్యూరిటీ గార్డు తన తుపాకీతో సాద్ అహ్మద్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన వెంటనే పాకిస్థానీ యూట్యూబర్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే అతడిని కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

యూట్యూబర్‌ను చంపిన సెక్యూరిటీ గార్డును కరాచీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తర్వాత, ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సాద్ అహ్మద్ హత్య పాకిస్తాన్‌లో తీవ్ర సంచలనం రేపుతోంది. అలాగే భద్రతా సిబ్బంది తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ తీసుకున్న నిర్ణయాన్ని నిజం చేస్తూ ఎదురు దాడికి దిగిన పాక్ బౌలర్లు టీమిండియాను 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 4 పాయింట్లు సాధించి గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా జట్టు రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ జట్టు 4వ స్థానానికి పడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..