T20 World Cup 2024: గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడు ఇప్పుడు బ్యాటర్లను డ్యాన్స్ ఆడిస్తున్నాడు.. గుర్తు పట్టారా?

పై ఫొటోలో కూల్‌గా కూర్చోని గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే పోలికలను చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు మాత్రం ఈ కుర్రాడెవరో కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే ఈ అబ్బాయి ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్.

T20 World Cup 2024: గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడు ఇప్పుడు బ్యాటర్లను డ్యాన్స్ ఆడిస్తున్నాడు.. గుర్తు పట్టారా?
Team India Cricketer
Follow us

|

Updated on: Jun 11, 2024 | 7:01 PM

పై ఫొటోలో కూల్‌గా కూర్చోని గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే పోలికలను చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు మాత్రం ఈ కుర్రాడెవరో కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే ఈ అబ్బాయి ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్. ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ జరుగుతోంది. ఇందులో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తుగా ఓడించింది. అయితే రెండో మ్యాచ్ లో ప్రత్యర్థి బలమైన పాకిస్తాన్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ చేతిలో మనకు పరాజయం తప్పదని భావించారు. పైగా మ్యాచ్ నైట్ ఉండడంతో చాలా మంది టీవీలు, మొబైల్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోయారు. తీరా ఉదయం చూస్తే ఉత్కంఠ మ్యాచ్ లో ఆరు పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించిందని తెలిసి మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత తెగ సంతోష పడ్డారు. ఈ విజయానికి ముఖ్య కారణం ఎవరో తెలుసు కదా. టీమిండియా రేసు గుర్రం జస్ ప్రీత్ బుమ్రా. పై ఫొటోలో కూల్ గా గిటారు వాయిస్తున్నది బుమ్రానే. ఇది అతని టీనేజ్ ఫొటో. దీనిని చూసిన అభిమానులు బుమ్రాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ మొదట 10 ఓవరల్లో నిలకడగానే బ్యాటింగ్ చేసింది. కేవలం బాబర్ ఆజామ్ వికెట్ మాత్రమే కోల్పోయింది. అది కూడా బుమ్రా తీసిందే. అయితే ఎప్పుడెతై బుమ్రా సెకెండ్ స్పెల్ కు దిగాడో పాక్ డీలా పడిపోయింది. బుమ్రా పదునైన బంతులకు పరుగులు చేయలేక పాక్ బ్యాటర్లు క్రీజులో డ్యాన్స్ ఆడాల్సి వచ్చింది. దీంతో వేగంగా పరుగులు చేసే క్రమంలో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 3 కీలక వికెట్లు (బాబర్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా