AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: అమెరికాపై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. ప్రైవేట్ డిన్నర్ పార్టీని రద్దు చేసిన పాకిస్తాన్..

Pakistan Cricket Team Private Dinner Party: టీ20 ప్రపంచకప్‌ కోసం అమెరికా వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అభిమానుల కోసం జట్టుతో కలిసి ప్రైవేట్‌గా విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొనడానికి 25 డాలర్ల రుసుము కూడా నిర్ణయించింది. పాకిస్థాన్ బోర్డు తీసుకున్న ఈ చర్య పెద్ద దుమారాన్ని రేపింది. అమెరికాపై ఘోర పరాజయం తర్వాత పీసీబీ ఈ ప్రైవేట్ విందును రద్దు చేసిందని ఇప్పుడు వార్తలు వచ్చాయి.

Pakistan: అమెరికాపై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. ప్రైవేట్ డిన్నర్ పార్టీని రద్దు చేసిన పాకిస్తాన్..
Pakistan Private Dinner Party
Venkata Chari
|

Updated on: Jun 07, 2024 | 8:19 PM

Share

Pakistan Cricket Team Private Dinner Party: టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024) వారం తర్వాత అభిమానులకు అసలైన మజాను అందించింది. 11వ మ్యాచ్‌లో అభిమానులకు కావాల్సినంత థ్రిల్ దొరికింది. ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన బలమైన జట్టుకు అమెరికా షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా అమెరికా (Pakistan vs USA) టీ20 ప్రపంచకప్ మొత్తం లెక్కలను తలకిందులు చేసింది. ఇంతకాలం బలమైన జట్లపై ఓడిపోతున్న పాకిస్థాన్ జట్టు.. ఇప్పుడు క్రికెట్ బిడ్డ అమెరికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి పాక్ జట్టును ఎంతగానో బాధించిందంటే.. టీమిండియా(Team India)తో మ్యాచ్ కు ముందు అభిమానులతో ప్రైవేట్ డిన్నర్ పార్టీ (Private Dinner Party)పెట్టాలని భావించిన పాక్ బోర్డు.. ఇప్పుడు ఆ డిన్నర్ పార్టీని రద్దు చేసేలా చేసింది.

ప్రైవేట్ పార్టీ రద్దు..

టీ20 ప్రపంచకప్‌ కోసం అమెరికా వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అభిమానుల కోసం జట్టుతో కలిసి ప్రైవేట్‌గా విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొనడానికి 25 డాలర్ల రుసుము కూడా నిర్ణయించింది. పాకిస్థాన్ బోర్డు తీసుకున్న ఈ చర్య పెద్ద దుమారాన్ని రేపింది. అమెరికాపై ఘోర పరాజయం తర్వాత పీసీబీ ఈ ప్రైవేట్ విందును రద్దు చేసిందని ఇప్పుడు వార్తలు వచ్చాయి.

వాస్తవానికి, పాకిస్తాన్ ఆటగాళ్లతో న్యూయార్క్‌లో అభిమానులకు ప్రైవేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయడానికి PCB వ్యతిరేకతను ఎదుర్కొంది. ప్రయివేట్‌ డిన్నర్‌ను ఇప్పుడు రద్దు చేసినట్లు పాకిస్థాన్‌ జర్నలిస్టు ఒకరు తెలిపారు. విందు రద్దు తర్వాత అభిమానుల డబ్బును బోర్డు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దం..

జూన్ 9న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు బాబర్ సేన న్యూయార్క్ చేరుకున్నట్లు పాక్ జట్టు వర్గాల సమాచారం. అమెరికాపై ఓడిన తర్వాత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రయాణంలో కూడా ఆటగాళ్లు తమలో తాము తక్కువగా మాట్లాడుకున్నారు. ఈ డిన్నర్ విషయంలో ఇప్పటికే పలు వివాదాలు తలెత్తగా.. ఇప్పుడు ఆటగాళ్ల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బోర్డు డిన్నర్‌ను రద్దు చేసినట్లు సమాచారం.

సోషల్ మీడియాను ఉపయోగించవద్దు..

నివేదికల ప్రకారం, పాక్ ఆటగాళ్లు ఓటమితో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తలపై చేతులు పెట్టుకుని కూర్చున్నారు. పాక్ జట్టు హోటల్ గదికి చేరుకోగానే అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. రషీద్ లతీఫ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు డిన్నర్ పార్టీని విమర్శించారు. ఇప్పుడు ఓటమి తర్వాత వివాదాలకు దూరంగా ఉండేందుకు పీసీబీ ఈ చర్య తీసుకుంది. సోర్సెస్ ప్రకారం, సోషల్ మీడియాను ఉపయోగించవద్దని PCB మొత్తం టీమ్‌కు సూచించింది. అభిమానుల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు భారత్‌తో మ్యాచ్ జరిగే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయవద్దని బోర్డు ఆటగాళ్లకు సూచించినట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..