Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Cricket Team: బాబర్ ఆజాం నియంతృత్వ వైఖరి.. కట్‌చేస్తే.. రెండుగా చీలిన పాక్ జట్టు..!

T20 World Cup 2024: బాబర్ అజామ్ నియంతృత్వ వైఖరి చాలా మంది ఆటగాళ్ల అసంతృప్తికి దారితీసిందని పాకిస్థానీ జర్నలిస్ట్ పేర్కొన్నాడు. జియో న్యూస్ ఛానల్ కరస్పాండెంట్ అర్ఫా ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం, బాబర్ ఆజం నియంతృత్వ వైఖరి పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా మంది ఆటగాళ్లకు కోపం తెప్పించడమే కాకుండా, బాబర్ ఎవరి మాట వినడు అనే వాస్తవం కూడా ఆటగాళ్ల మధ్య అసమ్మతికి దారితీసిందని తెలిపాడు.

Pakistan Cricket Team: బాబర్ ఆజాం నియంతృత్వ వైఖరి.. కట్‌చేస్తే.. రెండుగా చీలిన పాక్ జట్టు..!
Babar Azam
Follow us
Venkata Chari

|

Updated on: Jun 07, 2024 | 10:38 PM

టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024)లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తరువాత, పాకిస్తాన్ జట్టు (PAK vs USA) సన్నద్ధతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రికెట్‌లో పసికూన అమెరికాపై ఓటమి పాక్ క్రికెట్‌లో కలకలం సృష్టించింది. దీంతో పాటు టీమిండియా కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ బాబర్.. మ్యాచ్ ఓటమికి సహచర ఆటగాళ్లే కారణమని పేర్కొన్నాడు. ఆ తర్వాత బాబర్ ప్రకటనను జట్టు ఆటగాళ్లు వ్యతిరేకించారు. అలాగే పాకిస్థాన్ జట్టులో చీలిక వచ్చిందని పాక్ మీడియాకు సంబంధించిన ఓ జర్నలిస్ట్ రాసుకొచ్చాడు.

పాకిస్థాన్ జర్నలిస్ట్ ఏం చెప్పాడు?

బాబర్ అజామ్ నియంతృత్వ వైఖరి చాలా మంది ఆటగాళ్ల అసంతృప్తికి దారితీసిందని పాకిస్థానీ జర్నలిస్ట్ పేర్కొన్నాడు. జియో న్యూస్ ఛానల్ కరస్పాండెంట్ అర్ఫా ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం, బాబర్ ఆజం నియంతృత్వ వైఖరి పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా మంది ఆటగాళ్లకు కోపం తెప్పించడమే కాకుండా, బాబర్ ఎవరి మాట వినడు అనే వాస్తవం కూడా ఆటగాళ్ల మధ్య అసమ్మతికి దారితీసిందని తెలిపాడు.

పలు నిర్ణయాలపై అసంతృప్తి..

అర్ఫా ఫిరోజ్ తన X హ్యాండిల్‌లో ఈ మేరకు పోస్ట్ చేశాడు. ‘అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్ తీసుకున్న అనేక నిర్ణయాలు పాకిస్తాన్ ఆటగాళ్లకు కోపం తెప్పించాయి. బాబర్ ఒంటరిగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇది ఇతర ఆటగాళ్లను అసంతృప్తికి గురి చేస్తుంది. అలాగే ఇతర ఆటగాళ్లతో చర్చించాల్సిన మ్యాచ్‌లో బాబర్ ఒంటరిగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్ల మాట బాబర్ వినడం లేదు. పేలవమైన ఫీల్డింగ్ తర్వాత బాబర్ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హారిస్ రవూఫ్ వేసిన 20వ ఓవర్ చివరి బంతికి నితీష్ కుమార్ బౌండరీ బాదడంతో బాబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఈ తరహా వైఖరి ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.

మహమ్మద్ అమీర్ మాట కూడా వినలే..

మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో మహ్మద్ అమీర్ తన ఓవర్ పూర్తి చేసిన తర్వాత ఆ ఓవర్‌ను మరో ఫాస్ట్ బౌలర్‌కు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కానీ, బాబర్ దానిని పట్టించుకోకుండా స్పిన్నర్‌ను అనుమతించాడు. ఇది కూడా మ్యాచ్ ఓటమికి దారి తీసింది. ఈ కారణాలన్నింటి వల్లే పాక్ జట్టులో చీలిక వచ్చినట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..