T20 World Cup: ఇంత నోటిదూల ఏంటి సామీ.. టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.? కారణమిదే
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో నమీబియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-బీ నుంచి సూపర్-8కి అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంతేకాకుండా ఈ ఓటమితో నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు..

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో నమీబియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-బీ నుంచి సూపర్-8కి అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంతేకాకుండా ఈ ఓటమితో నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి స్కాట్‌లాండ్, ఇంగ్లాండ్ మధ్య సూపర్-8 రేసు కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారాయి. ఇంగ్లాండ్‌ను టోర్నీ నుంచి బయటకు నెట్టేయడం.. తమ జట్టుకు మంచి చేస్తుందని ఆసీస్ పేస్ బౌలర్ పేర్కొన్నాడు.
ఇక ఇంగ్లాండ్ టోర్నీ నుంచి వైదొలగాలి అంటే.. స్కాట్‌లాండ్ చేతుల్లో ఆస్ట్రేలియా ఓడిపోవాలి. కాబట్టి ఇంగ్లాండ్‌ను మట్టికరిపించేందుకు.. ఆస్ట్రేలియా జట్టు కావాలనే స్కాట్‌లాండ్ చేతిలో ఓడిపోతుందని అని రూమర్స్ మొదలయ్యాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌పై రెండు లేదా మూడు మ్యాచ్‌లపై నిషేధం పడవచ్చుట. నిజం నిరూపణమైతే.. ఆస్ట్రేలియా జట్టుపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చునని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐసీసీ నిబంధన ఏం చెబుతోంది?
ఐసీసీ టోర్నమెంట్లలో ఒక జట్టు గ్రూప్ దశ దాటాలంటే.. ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితులను మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇలాంటి సిట్యువేషన్‌లో ఏదైనా జట్టు ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చడానికి లేదా ఏదైనా జట్టును టోర్నీ నుంచి వైదొలగించేందుకు ప్రయత్నిస్తే, ICC రూల్స్‌ను అతిక్రమించినట్టే.
ICC ఆర్టికల్ 2.11 ప్రకారం, జట్టు కెప్టెన్ ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చినట్లయితే అతడు లెవల్-2 దోషిగా పరిగణించబడతాడు. ఈ పరిస్థితిలో, మ్యాచ్ అధికారులు మ్యాచ్ ఫీజులో 50 శాతంతో పాటు 4 డీమెరిట్ పాయింట్లు, 2 సస్పెన్షన్ పాయింట్లను విధిస్తారు. అంటే, ఆస్ట్రేలియా జట్టు ఇలా చేస్తే, కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను దోషిగా ప్రకటించి రెండు మ్యాచ్‌ల నిషేధం విధించవచ్చు.
ఇంగ్లాండ్ గెలవాలంటే..?
స్కాట్లాండ్‌తో ఇంగ్లాండ్ జట్టు ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఒక్క పాయింట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్‌కు 2 మ్యాచ్‌లలో ఒక పాయింట్ మాత్రమే వచ్చింది. నెట్ రన్‌రేట్ -1.800గా ఉంది. స్కాట్లాండ్ జట్టు 3 మ్యాచ్‌లలో 5 పాయింట్లు సాధించి, నెట్ రన్‌రేట్ +2.164తో కొనసాగుతోంది. అందువల్ల, ఇప్పుడు జోస్ బట్లర్ జట్టు సూపర్-8కి అర్హత సాధించడానికి విజయం మాత్రమే కాదు.. స్కాట్‌లాండ్ ఓటమి కూడా కీలకమే. ఇక స్కాట్లాండ్ తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలబడుతుంది.
ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి.




