AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs SRH Playing XI: టాస్ గెలిచిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 నుంచి ట్రావిస్ హెడ్ మిస్

ఈ సీజన్‌లో రెండు జట్లు 3-3 మ్యాచ్‌లు ఆడాయి. ఇద్దరూ 1-1 తేడాతో గెలిచి 2-2 తేడాతో ఓడిపోయారు. గత సంవత్సరం ఫైనల్ ఈ రెండు జట్ల మధ్య జరిగింది. అక్కడ కోల్‌కతా హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది.

KKR vs SRH Playing XI: టాస్ గెలిచిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 నుంచి ట్రావిస్ హెడ్ మిస్
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Toss Update
Follow us
Venkata Chari

|

Updated on: Apr 03, 2025 | 7:33 PM

ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ క్రమంలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ, ‘పిచ్ బాగుంది. గత సీజన్‌లో కూడా మా జట్టు ఇక్కడ బాగా ఆడింది. ఇది చాలా సుధీర్ఘమైన టోర్నమెంట్’ అంటూ చెప్పుకొచ్చాడు. కోల్‌కతా స్పెన్సర్ జాన్సన్ స్థానంలో మోయిన్ అలీకి అవకాశం ఇచ్చింది.

ఈ సీజన్‌లో రెండు జట్లు 3-3 మ్యాచ్‌లు ఆడాయి. ఇద్దరూ 1-1 తేడాతో గెలిచి 2-2 తేడాతో ఓడిపోయారు. గత సంవత్సరం ఫైనల్ ఈ రెండు జట్ల మధ్య జరిగింది. అక్కడ కోల్‌కతా హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..