IPL 2025: వరుస విజయాలతో గుజరాత్‌కు బిగ్ షాక్.. సీజన్ మధ్యలో జట్టును వీడిన స్టార్ ప్లేయర్..
Gujarat Titans pacer Kagiso Rabada: గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 18వ సీజన్ నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడు. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

Kagiso Rabda Return Home: ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ మంచి ప్రదర్శన కనబరిచింది. తమ సొంత మైదానంలో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినా, ఆ తర్వాత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచింది. అయితే, ఈలోగా గుజరాత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ స్టార్ బౌలర్ కగిసో రబాడ దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడు. దీంతో రాయల్ ఛాలెంజరస్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆడటం కనిపించలేదు. పర్సనల్ కారణాలతో అతను దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడని తెలుస్తోంది. అయితే, రాబోయే మ్యాచ్‌లకు కూడా దూరమవ్వనున్నాడని తెలుస్తోంది.
“కగిసో రబాడ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడు” అని గుజరాత్ టైటాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌తో ఆడిన దక్షిణాఫ్రికా పేసర్ తొలి మ్యాచ్‌లో 41 పరుగులు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రబాడ 1/42 గణాంకాలను నమోదు చేశాడు.
కాగా, ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ రబాడను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








