Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs SRH: వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2025లో భాగంగా  15వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది. వెంకటేష్ అయ్యర్ కేవలం 29 బంతుల్లో 60 పరుగులతో ఊచకోత కోశారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

KKR vs SRH: వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Score
Follow us
Venkata Chari

|

Updated on: Apr 03, 2025 | 9:20 PM

ఐపీఎల్ 2025లో భాగంగా  15వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది. వెంకటేష్ అయ్యర్ కేవలం 29 బంతుల్లో 60 పరుగులతో ఊచకోత కోశారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రఘువంశీ 50 పరుగులతో మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. షమీ, కమ్మిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండీస్ తలో వికెట్ పడగొట్టారు.

రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంగ్క్రిష్ రఘువంశీ కూడా 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 38 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఐదుగురు ఒక్కొక్కరు ఒక్కో వికెట్ పడగొట్టగా, ఒక బ్యాట్స్‌మన్ రనౌట్ అయ్యాడు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..