AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: శవాలను కూడా వదలని సైకో.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ పెద్దగా ఆడలేదు. అయితే గత వారమే ఓటీటీలోకి వచ్చేచేసిన ఈ మూవీ విశేష ప్రేక్ష‌కాధ‌ర‌ణతో దూసుకుపోతోంది. అస‌లు ఈ సినిమాను థియేట‌ర్ల‌లో ఎలా మిస్ అయ్యామురా? అంటూ చూసిన వారు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు.

OTT Movie: శవాలను కూడా వదలని సైకో.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 02, 2026 | 3:50 PM

Share

థియేటర్లయినా.. ఓటీటీలయినా .. ప్రస్తుతం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో ఆడని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఓటీటీలో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతంది. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అక్టోబర్ 02న థియేటర్లలో విడుదలైంది. కానీ పెద్దగా ఆడలేదు. కంటెంట్ బాగానే ఉన్నా సరిగా ప్రమోషన్స్ చేయకపోవడంతో త్వరగానే ఈ సినిమా థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఒకరిద్దరు ఈ సినిమా చూసిన వాళ్లు చాలా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ క్రైమ్ థ్రిల్లర్ గత శుక్రవారం (అక్టోబర్ 30) స్ట్రీమింగ్ కు వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై ప్రభావం చూపని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో అద్దరగొడుతోంది. ఓటీటీ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది….నగర శివార్లలో ఓ గుర్తు తెలియని శవం దొరుకుతుంది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే నగరంలో మరిన్ని హత్యలు జరుగుతాయి. దీంతో నగరంలో ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు ఎస్ ఐ. అయితే కేసు డీల్ చేస్తున్న టైంలో ఓ డెడ్ బాడీ కనిపించకుండా పోతుంది.

మరి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతోన్న సీరియల్ కిల్లర్ ఎవరు? అసలు ఆ క్రిమినల్ మోటివ్ ఏంటి? చివరకు పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? అనేదే ఈ సినిమా మిగతా కథ. ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ఎస్ ఐ యుగంధర్. హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించాడు. రాఘవేంద్ర కటారి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన మేఘలేఖ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటే రాకేందు మౌళి, పవన్ తేజ్ కొణిదెల, గాయత్రి భార్గవి, కాదంబరి కిరణ్, శివకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఎస్ ఐ యుగంధర్ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎస్ ఐ యుగంధర్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శవాలను కూడా వదలని సైకో.. OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా
శవాలను కూడా వదలని సైకో.. OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా
దీపావళి రోజు తలంటు స్నానం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి, గంగాదేవి
దీపావళి రోజు తలంటు స్నానం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి, గంగాదేవి
దూసుకొస్తున్న మురసు తుఫాన్..
దూసుకొస్తున్న మురసు తుఫాన్..
తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, ఛార్జీలు ఎంత?
తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, ఛార్జీలు ఎంత?
టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా?
టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా?
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..