SRH vs RR, IPL 2024: పరాగ్, జైస్వాల్ శ్రమ వృథా.. థ్రిల్లింగ్ పోరులో ఒక పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
Sunrisers Hyderabad vs Rajasthan Royals: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన ఆ జట్టు గురువారం (మే 02) సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది
Sunrisers Hyderabad vs Rajasthan Royals: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన ఆ జట్టు గురువారం (మే 02) సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (76 నాటౌట్), ట్రావిస్ హెడ్ (58), హెన్రిచ్ క్లాసెన్ (42 నాటౌట్) చెలరేగి ఆడి హైదరాబాద్ జట్టుకు భారీ స్కోరును అందించారు. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) అర్ధశతకాలు చేశారు. ఆఖర్లో రోమన్ పావెల్ తో మెరుపు ఇన్నింగ్స్ తో ఆశలు రేపినా భువనేశ్వర్ వేసిన ఒక చక్కటి బంతికి ఎల్బీడబ్బ్యూగా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంలో ప్లే ఆఫ్ రేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేసింది.
భువనేశ్వర్ మ్యాజిక్ బాల్.. వీడియో ఇదిగో..
Jumps of Joy in Hyderabad 🥳
Terrific turn of events from @SunRisers‘ bowlers as they pull off a nail-biting win 🧡
Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc
— IndianPremierLeague (@IPL) May 2, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్లు:
జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్
Riyan Parag was on his merry way tonight 👌
He departs after a counter-attacking 77(49) 🙌#RR require 42 runs off 24 balls!
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | @rajasthanroyals pic.twitter.com/XZH9Wx4TsD
— IndianPremierLeague (@IPL) May 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..