AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఒక్కడితోనే చస్తున్నాం.. SRHలో మరో డేంజరస్ ప్లేయర్.. బౌలర్లకు ఇక బడితపూజే..!

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో ఒక యువ సంచలనం సత్తా చాటుతోంది. పంజాబ్ యువ హిట్టర్ సలీల్ అరోరా తన బ్యాటింగ్ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే వరుసగా 5 సిక్సర్లు బాది వార్తల్లో నిలిచిన ఈ పవర్ హిట్టర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

IPL 2026: ఒక్కడితోనే చస్తున్నాం.. SRHలో మరో డేంజరస్ ప్లేయర్.. బౌలర్లకు ఇక బడితపూజే..!
Srh vs rcb
Venkata Chari
|

Updated on: Mar 25, 2026 | 1:45 PM

Share

Salil Arora SRH: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి సిద్ధమవుతున్న వేళ ఆరెంజ్ ఆర్మీకి ఒక కొత్త ఆశాకిరణం దొరికింది. పంజాబ్ క్రికెట్ నుంచి దూసుకొచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా ఈసారి ఎస్ఆర్ హెచ్ (SRH) తరపున అరంగేట్రం చేయబోతున్నాడు. గత వేలంలో సన్రైజర్స్ యాజమాన్యం ఇతర జట్లతో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఈ యువ ప్రతిభావంతుడిని సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే తన పవర్ హిట్టింగ్‌తో గుర్తింపు పొందిన సలీల్, ఇప్పుడు ఐపీఎల్ వంటి భారీ వేదికపై సత్తా చాటాలని చూస్తున్నాడు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో విధ్వంసం..

టీమ్ ఇండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం సలీల్ అరోరా బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన ఎస్ఆర్ హెచ్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సలీల్ ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 13 బంతుల్లోనే 40 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శన చూసిన క్రికెట్ విశ్లేషకులు అతన్ని మరో ‘అభిషేక్ శర్మ’గా అభివర్ణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: షేన్ వార్న్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ డీల్‌తో తన పిల్లలకు వేల కోట్ల ఆస్తి.. ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

మిడిల్ ఆర్డర్‌లో గట్టి పోటీ..

సలీల్ అరోరా రాకతో ఎస్ఆర్ హెచ్ మిడిల్ ఆర్డర్‌లో పోటీ పెరిగింది. ఇప్పటికే జట్టులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి లేదా అనికేత్ వర్మ వంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోతే, సలీల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బెంచ్ మీద ఇంతటి ప్రతిభావంతుడైన ఆటగాడు ఉండటం వల్ల ప్రధాన ఆటగాళ్లపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

పంజాబ్ నుంచి వచ్చిన అభిషేక్ శర్మ, రమణ్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్‌లో తమ ముద్ర వేశారు. ఇప్పుడు అదే బాటలో సలీల్ అరోరా కూడా పయనిస్తున్నాడు. ఒకవేళ ఈ సీజన్‌లో అతనికి అవకాశం దక్కితే, ఎస్ఆర్ హెచ్ మిడిల్ ఓవర్లలో మరింత వేగంగా పరుగులు సాధించే వీలుంటుంది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా ఈ కొత్త పవర్ హిట్టర్ మెరుపులను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us