AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains: నైరుతి ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..

ఏపీకి వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. రానున్న మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల పడతాయని స్పష్టం చేసింది.

Rains: నైరుతి ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
Rains
Venkatrao Lella
|

Updated on: Jun 16, 2026 | 1:36 PM

Share

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 15, 2026వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 18° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్‌బని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్ మరియు 28.3° ఉత్తర అక్షాంశం /83° తూర్పు రేఖాంశం గుండా విస్తరించింది. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్‌పై గల ఉపరితల ఆవర్తనం నుండి, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ విడుదల చేసింది.

ఏపీలో భారీ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది . వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అమరావతి వాతారణశాఖ స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలతో పాటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమకు వర్షసూచన

ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

Follow Us