AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కొడుకుల్ని చూశారా.. హీరోల్లా ఉన్నారుగా.!!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్.

బాబోయ్..! స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కొడుకుల్ని చూశారా.. హీరోల్లా ఉన్నారుగా.!!
Simran
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 1:15 PM

Share

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సిమ్రాన్ బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు. అప్పట్లో సిమ్రాన్ హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. సన్నజాజి నడుముతో ఆడియన్స్ ను కవ్వించారు సిమ్రాన్. సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగలాంటి నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్. మహేష్ హీరోగా నటించిన యువరాజు సినిమాలో నటించింది.

అలాగే సిమ్రాన్ తమిళ్‌లోనూ దాదాపు అందరు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సిమ్రాన్. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సిమ్రాన్. సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఆతర్వాత ధ్రువనక్షతం అనే సినిమాలో నటించారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ నటించారు సిమ్రాన్

మొన్నామధ్య సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలోనూ నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సిమ్రాన్ తమిళనాడు సీఎం విజయ్ ను కలిశారు. ఫ్యామిలీతో కలిసి సీఎం విజయ్ ను కలిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు. సిమ్రాన్ కొడుకులు అచ్చం హీరోల్లా ఉన్నారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు