AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. వామ్మో.. వెలుగులోకి కళ్లు చెదిరిపోయే అంచనాలు..

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రెండు వారాల పాటు భారీగా పడిపోగా.. మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి అంచనాలు సంచలనంగా మారాయి. ఆయన ఏమన్నారంటే..

Gold Rates: బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. వామ్మో.. వెలుగులోకి కళ్లు చెదిరిపోయే అంచనాలు..
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Jun 16, 2026 | 1:00 PM

Share

బంగారం ధరలపై ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు భారీగా పెరుగుతాయని ఆయన మరోసారి తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్‌లో తన అంచనాలను వెల్లడించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ, దేశాల ఆర్ధిక వ్యవస్థలు వంటి వాటి గురించి కియోసాకి తన అంచనాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటారు. గతంలో ఆయన చెప్పిన అంచనాలన్నీ నిజం అయ్యాయి. దీంతో ఆయన అభిప్రాయాలు తెలుసుకునేందుకు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కియోసాకి బంగారం ధరలపై సంచలన ప్రకటన చేశారు.

బంగారం ధరలు పెరుగుతాయి

బంగారం ధరలు భారీగా పెరుగుతాయని కియోసాకి తెలిపాయి. ప్రస్తుత పెరుగుదల ఆరంభం మాత్రమేనని, త్వరలోనే భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. బంగారం తన కదలికలను ప్రారంభించిందని, ఒక్క రోజులోనే 100 డాలర్లను దాటిందని అన్నారు. పసిడి ధరల పెరుగుదల ఇప్పుడే మొదలైందని, ఇవాళ ఔన్సుకు 4300 డాలర్లకు చేరుకుందన్నారు. 2035 నాటికి ఔన్సుకు 35 వేల డాలర్లకు ఖచ్చితంగా చేరుకుంటుందని తాను చెప్పలగనని అన్నారు. “35తో మొదలై 35తో ముగిసే తేదీలు, సంఖ్యలు ఎంత బాగున్నాయి. దురదృష్టవశాత్తూ నగదు పనికిరానిది. నగదును పొదుపు చేసేవారు పెద్దగా నష్టపోతారు. మీరు నష్టపోకండి. కొంత నగదు తీసుకుని బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం, చమురు కొనండి. నేను సంవత్సరాలుగా అదే చేస్తున్నాను. నకిలీ డబ్బు తీసుకుని, నిజమైన డబ్బును పొదుపు చేస్తున్నాను. నేను నష్టపోవడాన్ని ఇష్టపడను. మీరు కూడా నష్టపోకూడదని నేను కోరుకుంటున్నాను. జాగ్రత్త” అంటూ హెచ్చరించారు.

నిజమవుతున్న అంచనాలు

కాగా కియోసాకి గత కొద్ది నెలలుగా బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి వాటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో లాభపడతారంటూ పెట్టుబడిదారులను అలర్ట్ చేస్తున్నారు. బంగారం ఎప్పుడు తగ్గుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది అనే విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎక్కవసార్లు ఆయన అంచనాలు నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్లుగానే జరుగుతున్నాయి.

Follow Us