Ramcharan: బిర్యానీతో రామ్ చరణ్‌ను మెప్పించిన జపాన్ చెఫ్! ఎలా నేర్చుకున్నాడంటే..!
బిర్యానీ అంటే భారతీయులకు కేవలం ఆహారం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వరకు ప్రతి ప్రాంతానికి తనదైన బిర్యానీ ప్రత్యేకత ఉంది. అయితే ఈ భారతీయ వంటకంపై ప్రేమ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. జపాన్‌కు చెందిన ఓ చెఫ్ గత 15 సంవత్సరాలుగా బిర్యానీని పరిపూర్ణంగా తయారు చేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

టోక్యోకు చెందిన తకమాసా ఒసావా, ప్రస్తుతం “బిర్యానీ ఒసావా” పేరుతో ప్రసిద్ధి చెందారు. చిన్నప్పటి నుంచే అన్నం అంటే ఇష్టపడే ఒసావా, ఒకసారి “బిర్యానీ” అనే పదం కనిపించడంతో ఆసక్తిగా ఆ వంటకాన్ని రుచి చూశాడు. ఆ ఒక్క అనుభవమే అతని జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో పర్యటిస్తూ బిర్యానీ తయారీ రహస్యాలను అధ్యయనం చేశాడు.

Japanese Chef Trying Biryani
ప్రస్తుతం టోక్యోలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉన్న చిన్న రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న ఒసావా, అక్కడ ఒక్క బిర్యానీనే ప్రధాన వంటకంగా అందిస్తున్నాడు. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు అప్పుడప్పుడు ఎండ్రకాయలు, పీతలతో ప్రత్యేక బిర్యానీలను కూడా తయారు చేస్తున్నాడు. అతని రెస్టారెంట్‌కు మిష్లిన్ గైడ్ నుంచి “బిబ్ గౌర్మాండ్” గుర్తింపు కూడా లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి బిర్యానీ వండి పెట్టడం ద్వారా ఒసావా మరింత వార్తల్లో నిలిచాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
View this post on Instagram
భాష తెలియకపోయినా వాసన, రుచి, స్పర్శ, పరిశీలన ద్వారా నేర్చుకున్నానని ఒసావా చెబుతున్నాడు. భారతీయ బిర్యానీపై అతని అంకితభావం చూసి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిర్యానీని ఒక వంటకంగా కాకుండా ఓ సంస్కృతిగా అర్థం చేసుకోవాలనే అతని ప్రయత్నం ఇప్పుడు భారత్-జపాన్ మధ్య ప్రత్యేక ఆహార బంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..