RBI: ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒక్క గ్రాముకు రూ.14 వేలు.. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి పండుగే..
ఆర్బీఐ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి శుభవార్త. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ - iiiకి ప్రీ మెచ్యూర్ డేట్ ప్రకటించింది. జూన్ 16వ తేదీ నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.

బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి పండుగే. గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసినవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్బుత అవకాశం కల్పిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-iii ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ డేట్, ప్రైస్ తాజాగా ప్రకటించింది. 2020-21 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ – iiiకి ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర వెల్లడించింది. 2019 జూన్ 16వ తేదీన ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. 2026 జూన్ 16 నుంచి ముందుగా రిడెంప్షన్ చేసుకునే మంచి అవకాశం ఆర్బీఐ కల్పిస్తోంది. 2019లో బాండ్ ఇష్యూ చేసినప్పుడు గ్రాము ధర రూ.4677గా ఉండగా.. ఇప్పుడు ముందుగా విత్ డ్రా చేసుకునేవారికి గ్రాముకు రూ.14,774గా నిర్ణయించింది. జూన్ 11,12,15వ తేదీల్లో సగటు ధర ఆధారంగా ఫిక్స్ చేసింది.
రూ.లక్ష పెట్టుబడికి రూ.3 లక్షలు
ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి గ్రాములపై రూ.10,147 లాభం లభించనుంది. అంటే 219.30 శాతం లాభం దక్కనుంది. దీని ప్రకారం చూస్తే ఏడేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టినవారికి 219 శాతం రిటర్న్స్ రానున్నాయి. అంటే ఇప్పుడు రూ.3,19,300 అందనున్నాయి. లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు ఇప్పుడు రానుంది. ఈ బాండ్లపై ఆర్బీఐ 2.50 శాతం వార్షిక వడ్డీ అందిస్తుండగా.. ప్రతీ లక్షపై ఒక ఏడాదికి రూ.2500 వడ్డీ లభించనుంది. ఏడేళ్లల్లో రూ.17,500 వడ్డీ అందుతుంది. లక్ష పెట్టుబడిపై రూ.3,36,800 ఇప్పుడు అందనుంది. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది జాక్ పాట్‌గా చెప్పవచ్చు. అయితే గోల్డ్ బాండ్ కాలపరిమితి 8 ఏళ్లు ఉంటుంది. కానీ ఐదేళ్ల తర్వాత ముందుగానే అడ్వాన్స్‌డా విత్ డ్రా చేసుకునే అవకాశం ఆర్బీఐ కల్పిస్తోంది. 2019లో బంగారం రేటుతో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసినవారికి భారీగా లాభాలు దక్కనున్నాయి.
కాగా గతంలో ఆర్బీఐ గోల్డ్ బాండ్లను ఎక్కువగా జారీ చేస్తూ ఉండేది. వారానికి ఒక బాండ్ విడుదల చేేసింది. ఆ తర్వాత ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి జారీ చేసేది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో గోల్డ్ బాండ్లను జారీ చేయడం పూర్తిగా నిలిపివేసింది. అయితే ఆర్బీఐ గోల్డ్ బాండ్లను తిరిగి ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
