AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ నినో ఎఫెక్ట్.. నీరు ఎక్కువగా అవసరం లేని ఆరుతడి పంటలు ఇవే..

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాధార ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్‌లో ఈ పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎల్ నినో ఎఫెక్ట్.. నీరు ఎక్కువగా అవసరం లేని ఆరుతడి పంటలు ఇవే..
Dryland Crops
Shaik Madar Saheb
|

Updated on: Jun 16, 2026 | 1:38 PM

Share

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది.. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఆరుతడి పంటల వైపు దృష్టిసారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తగ్గడం వల్ల కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు.. పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, రైతులలో అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.. అలాగే అందుబాటులో ఉన్న వనరులతో పాటు మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలతోపాటు.. వర్షాలు, ఎక్కువగా నీటిపై ఆధారపడే వారు ఖరీఫ్ లో వర్షాధారంగా లేదా తక్కువ నీటి తడులతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం ఎంతో అవసరం. ఆరుతడి పంటలు (Dryland Crops) వల్ల నష్టాలను నివారించవచ్చని పేర్కొంటున్నారు.

ఖరీఫ్ సీజన్‌లో అనువైన ప్రధాన ఆరుతడి పంటలు:

అపరాలు-  పప్పుధాన్యాలు

కందులు: తేమ తక్కువగా ఉండే ఎర్ర నేలలు, మెట్ట ప్రాంతాలకు ఇవి చాలా అనుకూలం.. నీటిని తక్కువగా ఉపయోగించుకోని సాగు చేసుకోవచ్చు..

పెసర – మినుము: పెసర, మినుము 75-90 రోజుల్లో చేతికి వచ్చే పంటలు.. వీటికి నీరు కూడా తక్కువ అవసరం ఉంటుంది.

నూనె గింజలు

వేరుశనగ: వర్షాలు తక్కువగా ఉన్నా తేలికపాటి నేలల్లో బాగా పండుతుంది. వేరుశనగ (పల్లి) పంటకు సాధారణంగా నీరు ఎక్కువగా అవసరం లేదు.

సోయాబీన్: నల్లరేగడి నేలలు, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేయడానికి ఇది ఉత్తమమైన ఎంపిక.

నువ్వులు: ఖరీఫ్ ప్రారంభంలో (తొలకరి) వేసుకోవడానికి అనువైన నూనె గింజ పంట.

చిరుధాన్యాలు

జొన్న, సజ్జలు, రాగి .. నీటి వనరులు తక్కువగా ఉన్నా, వర్షాలు అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటలు సులువుగా పెరుగుతాయి.

మొక్కజొన్న కూడా అద్భుతమైన ఆరుతడి పంట. తక్కువ నీటి లభ్యత ఉన్న పరిస్థితుల్లోనూ, అధిక దిగుబడిని, మంచి ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటగా, ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు దీనిని సాగు చేసుకోవచ్చు.

అయితే.. సాధారణంగా ఖరీఫ్ కాలంలో అధిక వర్షపాతం కారణంగా రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు. ఎల్ నీనో ప్రభావంతో నీటి వనరులు తక్కువగా ఉండే అకాశం ఉండటంతో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎల్ నినో సమయంలో ఆరుతడి పంటలు వేయడంతో పాటు.. బిందు సేద్యం (Drip Irrigation) లేదా తుంపర సేద్యం (Sprinkler Irrigation) పద్ధతులను వాడితే ఉన్న కొద్దిపాటి నీటిని మరింత పొదుపుగా వాడుకోవచ్చు. అలాగే నేలలో తేమ ఆరిపోకుండా మల్చింగ్ (Mulching) పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us