గుడ్లు తిన్న తర్వాత ఇలా అనిపిస్తే.. మీకు అలర్జీ ఉన్నట్లే
16 June 2026
TV9 Telugu
TV9 Telugu
గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో వాటిని రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంతమందిలో గుడ్లు తింటే అలర్జీ లేదా సున్నితత్వం ఉంటుంది
TV9 Telugu
అలాంటి సందర్భాల్లో వికారం, కడుపు నొప్పి లేదా జీర్ణ సంబంధిత అసౌకర్యాలు కనిపిస్తాయి. గుడ్లు తిన్న ప్రతిసారి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది
TV9 Telugu
గుడ్లను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో వికారం లేదా స్వల్ప చర్మ అలర్జీలు కూడా కనిపిస్తాయి
TV9 Telugu
అలాగే ప్రోటీన్ కోసం పూర్తిగా గుడ్లపైనే ఆధారపడటం వల్ల ఇతర ఆహారాల ద్వారా లభించే పోషకాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది
TV9 Telugu
అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్ల వినియోగంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
గుడ్లను వెన్న, చీజ్, ప్రాసెస్డ్ మాంసాహార పదార్థాలతో కలిపి వండితే ఆహారంలో సంతృప్త కొవ్వులు పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి
TV9 Telugu
రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే విషయం వయస్సు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది
TV9 Telugu
సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు రోజుకు ఒక గుడ్డు చొప్పున తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు