Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ బెర్తులు ఫిక్స్.. టీమిండియా ప్రత్యర్థి ఎవరంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్ (గ్రూప్ ఎ), ఆస్ట్రేలియా (గ్రూప్ బి) నాకౌట్ పోరుకు అర్హత సాధించగా, ఇప్పుడు గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా అధికారికంగా అర్హత సాధించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్ ఫలితం రాకముందే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారైంది. దీంతో అఫ్గానిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 లో నాలుగు జట్లు అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ ఎలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఇంతలో, ఆస్ట్రేలియా కూడా గ్రూప్ బిలో సెమీస్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా సెమీఫైనల్లోకి ప్రవేశించిన నాల్గవ జట్టుగా అవతరించింది. ఆశ్చర్యకరంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్ ఫలితం రాకముందే దక్షిణాఫ్రికా సెమీఫైనల్ టికెట్‌ను దక్కించుకుంది. ఆఫ్రికా సెమీస్ కు చేరుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ ఛాన్స్ కు ఎలాంటి ఢోకా లేదు.
శుక్రవారం (ఫిబ్రవరి 28) అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆఫ్ఘన్ జట్టు ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. అయితే, ఆఫ్ఘన్ జట్టుకు ఇంకో అవకాశమునింది. శనివారం (మార్చి 01) ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 210 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడి తే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ పరంగా సెమీఫైనల్‌కు చేరుకునేది. నిజానికి, ఈ మ్యాచ్‌కు ముందు, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు చెరో 3 పాయింట్లు ఉన్నాయి. కానీ దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్‌లో చాలా ముందుంది. అటువంటి పరిస్థితిలో, దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. అయితే, ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో 210 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడి ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌కు సెమీఫైనల్లో ఆడే అవకాశం ఉండేది. అయితే అదేమీ జరగలేదు. దక్షిణా ఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను 200 మార్కును దాటనివ్వలేదు.
రేపటి మ్యాచ్ అయ్యే దాకా ఆగాల్సిందే..
ఇక సెమీఫైనల్ లో టీమిండియా ప్రత్యర్థి ఎవరన్నది రేపటి మ్యాచ్ తోనే ఖరారవుతుంది. ఆదివారం(మార్చి 02) భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తోనే సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఖరారు కానున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను ఓడిస్తే, వారు 5 పాయింట్లతో గ్రూప్ Bలో అగ్రస్థానంలో ఉంటారు. ఇది సాధ్యమైతే, ఆఫ్రికా మార్చి 5న జరిగే రెండవ సెమీఫైనల్‌లో గ్రూప్ Aలో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే, పాయింట్ల పట్టికలో కేవలం 3 పాయింట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాత వారు మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో తలపడతారు. కానీ ఇదంతా ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాతే ఖరారవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








