10 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కట్ చేస్తే.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు గట్టి షాక్.!

ఆసియాలో సుమారు 9 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత విజయం దక్కడంతో సఫారీలు ఫుల్ జోష్ మీదున్నారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ 16 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు 2008లో బంగ్లాదేశ్‌ను..

10 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కట్ చేస్తే.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు గట్టి షాక్.!
Cricket
Follow us

|

Updated on: Oct 24, 2024 | 8:46 PM

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న దక్షిణాఫ్రికా.. రెండు టెస్ట్ సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. మిర్పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఇక దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఆసియాలో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు సఫారీలు. ఆసియాలో సుమారు 9 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత విజయం దక్కడంతో సఫారీలు ఫుల్ జోష్ మీదున్నారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ 16 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు 2008లో బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా తన సొంత మైదానంలో ఓడించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక కొద్దిసేపటికే ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 106 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్ హసన్ జాయ్ అత్యధికంగా 30 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీం తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టుపై 202 పరుగుల లీడ్ సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున కైల్ వెర్న్ సెంచరీతో కదంతొక్కాడు.

అటు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 307 పరుగులు చేయగా.. ఆ జట్టు నడ్డి విరవడంలో కగిసో రబాడ 6 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. చివరిగా 106 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి చేధించింది దక్షిణాఫ్రికా జట్టు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌లతో టెస్ట్ సిరీస్‌లు దక్షిణాఫ్రికా ఆడనుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హోరాహోరీ పోరు సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూటీసీ భారత్ ఫైనల్ చేరాలంటే.. కనీసం ఐదు మ్యాచ్‌లు గెలవాలి.. అలా కాకుండా నాలుగింటిలో గెలిస్తే.. టాప్ 2 ఖాయం. ఇక ఒకవేళ నాలుగు విజయాల్లోనూ ఇబ్బంది ఎదురైతే.. భారత్ 64.04 శాతానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఆసీస్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అటు ఆస్ట్రేలియా కూడా నాలుగు కచ్చితంగా గెలవాలి డబ్ల్యూటీసీ రేసులో ఉండాలంటే.. అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ రెండు జట్లకు కీలకంగా మారింది. ఒకవేళ ఎక్కడ తేడా వచ్చినా సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరినట్టే.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి