IND vs NZ: ముగిసిన మొదటి రోజు ఆట.. మళ్లీ నిరాశపర్చిన కెప్టెన్ రోహిత్.. టీమిండియా స్కోరు ఎంతంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపర్చాడు. పుణె వేదికగా న్యూజిలాండ్ తో గురవారం (అక్టోబర్ 24) ప్రారంభమైన రెండో టెస్టు లో పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. అంతకు ముందు బెంగళూరు టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లోనూ రోహిత్ డకౌట్ అయ్యాడు.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు మొత్తం 11 వికెట్లు నేలకూలాయి. అలాగే 275 పరుగులు వచ్చాయి. మొదట భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది. ఇప్పుడు రెండో రోజు టీమిండియా బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారన్నదానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లు చుక్కలు చూపించారు. మొదట ఆర్ అశ్విన్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ ను కుప్పకూల్చాడు. చివరి 7 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ డెవాన్ కాన్వే 141 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్రన్ 65 పరుగులు చేశాడు.
ఆ తర్వాత టీమిండియా ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మలు రంగంలోకి దిగారు. ఇద్దరూ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడో ఓవర్ చివరి బంతికి టిమ్ సౌథీ బౌలింగ్ లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ను సౌథీ అవుట్ చేయడం ఇది 14వ సారి. రోహిత్ తర్వాత గిల్ రంగంలోకి దిగాడు. యశస్వి, గిల్ ఇద్దరూ ఆట ముగిసే వరకు మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. భారత్ 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 10, జైస్వాల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Stumps on Day 1 of the 2nd Test.#TeamIndia trail by 243 runs in the first innings.
Scorecard – https://t.co/3vf9Bwzgcd… #INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/diCyEeghM4
— BCCI (@BCCI) October 24, 2024
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐజాజ్ పటేల్, విలియం ఓ’రూర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




