Video: ఇంగ్లండ్‌ను వాళ్ల గడ్డపైనే ఓడించి.. షర్ట్ విప్పి సెలబ్రేషన్స్‌తో ఇజ్జత్ తీసిన ‘దాదా’
Sourav Ganguly Birthday: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆయన జులై 8, 1972న కోల్‌కతాలో జన్మించారు. జులై 8న జన్మించిన సౌరవ్ గంగూలీ గురించి 8 కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Sourav Ganguly Birthday: సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కెప్టెన్‌గా ఎన్నో ఘన విజయాలు అందుకున్నాడు. విదేశీ గడ్డపై ఎలా పోరాడాలో భావి తరాలకు చేసి చూపించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు. భారత క్రికెట్‌తో ముడిపడి ఉన్న ‘ఘర్ కే షేర్’ అనే ట్యాగ్‌లైన్‌ను తుడిచివేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సరళంగా చెప్పాలంటే, భారత క్రికెట్‌ను మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. భారత జట్టు హిస్టరీలో దిగ్గజ కెప్టెన్‌గా పేరుగాంచాడు. నేడు ఆయన పుట్టినరోజు అంటే, జులై 8, 1972న కోల్‌కతాలో జన్మించిన సౌరవ్ గంగూలీకి 54 సంవత్సరాలు నిండాయి. సౌరవ్ గంగూలీ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ, జులై 8న దాదాకు సంబంధించిన 8 కీలక విషయాలను తెలుసుకుందాం..
సౌరవ్ గంగూలీకి సంబంధించిన 8 కీలక విషయాలు..
- వన్డే క్రికెట్‌లో వరుసగా నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఏకైక క్రికెటర్ సౌరవ్ గంగూలీ.
- 1997, 2000 మధ్య వరుసగా 4 క్యాలెండర్ సంవత్సరాల్లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సౌరవ్ గంగూలీ. అతను 1997లో 1338 పరుగులు చేశాడు. 1998లో 1328 పరుగులు చేశాడు. 1999లో 1767 పరుగులు చేయగా, 2000లో 1579 పరుగులు చేశాడు.
- సౌరవ్ గంగూలీ తన వన్డే కెరీర్‌లో 11,363 పరుగులు చేశాడు. ఇది భారతదేశంలో ఏ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులుగా నిలిచాయి. ఈ సందర్భంలో, అతను శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర (14,234 పరుగులు), సనత్ జయసూర్య (13,430 పరుగులు) తర్వాత ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు.
- వన్డే క్రికెట్‌లో 10000 కంటే ఎక్కువ పరుగులు, 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలోని 6 మంది క్రికెటర్లలో సౌరవ్ గంగూలీ ఒకరు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌లో సెంచరీ చేసిన ఏకైక భారతీయ బ్యాట్స్‌మన్ సౌరవ్ గంగూలీ.
- సౌరవ్ గంగూలీ వన్డే కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అతను విదేశీ గడ్డపై చేసిన 22 సెంచరీలలో 18 సెంచరీలకు స్క్రిప్ట్‌ను అతనే రాశాడు. అంటే అతను భారతదేశం వెలుపల 18 వన్డే సెంచరీలు చేశాడు.
- ఆస్ట్రేలియాలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్ సౌరవ్ గంగూలీ. టెస్ట్ క్రికెట్ గురించి చెప్పాలంటే, అతను SENA దేశాలలో – ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, న్యూజిలాండ్‌లలో సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాలో అతను అలా చేయలేకపోయాడు.
- ఇప్పటివరకు, ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో నాకౌట్‌లలో 3 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు ముగ్గురు మాత్రమే, వారిలో ఒకరు సౌరవ్ గంగూలీ. అతనితో పాటు, అలా చేసిన ఇతర ఇద్దరు బ్యాట్స్‌మెన్లు రికీ పాంటింగ్, సయీద్ అన్వర్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..








