IPL 2025: వామ్మో.. ఈ హీరోయిన్ రోహిత్ పాలిట లక్కీ లేడీనా.. మ్యాచ్‌కు వచ్చిందంటే రిజల్ట్ మారాల్సిందే?
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సందడి చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్‌కు ఓ హీరోయిన్ లక్కీ లేడీగా మారిపోయిందంట.

Sonal Chauhan On Rohit Sharma Lucky Charm: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు రోహిత్ శర్మ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఐపీఎల్ (IPL) 2025 ప్రారంభంలో రోహిత్ శర్మ బ్యాట్ రాణించకపోయినా, అతను నెమ్మదిగా ఫామ్‌లోకి వస్తున్నాడు. ఇంతలో , బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కారణంగా రోహిత్ శర్మ మరోసారి వెలుగులోకి వచ్చాడు. అందుకు గల కారణం ఓసారి చూద్దాం..
సోనాల్ చౌహాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రోహిత్ శర్మ పాలిట అదృష్టవంతురాలు అంటూ అభిమానులు నమ్ముతున్నట్లు ఈ నటి చెబుతోంది. నిజానికి, వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచింది. రోహిత్ 70 పరుగులు చేశాడు. ఈ సమయంలో సోనాల్ స్టేడియంలో ఉంది. ఈ కారణంగా, అభిమానులు ఆమెను రోహిత్ పాలిట లక్కీ లేడీగా పిలుస్తున్నారు.
రోహిత్ శర్మ పాలిట లక్కీ లేడీ..
సోనాల్ చౌహాన్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో భాగమైంది. అక్కడ ఆమెను ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ గురించి అడిగారు. ఈ సమయంలో, ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత, అభిమానులు సోనాల్ చౌహాన్‌పే రోహిత్ శర్మ పాలిట అదృష్టవంతురాలిగా చూస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించింది. దీనిపై సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ గొప్ప క్రికెటర్ అని, అతనికి ఎలాంటి లేడీ లక్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కానీ నేను అతని మ్యాచ్ చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మ్యాచ్‌ను చాలా ఆస్వాదించాను. సోనాల్ రోహిత్‌ను తన అభిమాన క్రికెటర్‌గా చెప్పుకొచ్చింది.
మిస్ వరల్డ్ టూరిజం విజేతగా సోనాల్ చౌహాన్..
View this post on Instagram
బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ 1987 మే 16న నోయిడాలో జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యను నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీలోని గార్గి కళాశాల నుంచి తదుపరి చదువులు పూర్తి చేసింది. సోనాల్ 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకుంది. ఈ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా సోనాల్ చౌహాన్ అని తెలిసిందే.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








