AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యం కాలే.. అరుదైన రికార్డులో శుభ్మన్ గిల్.. అదేంటంటే?

Shubman Gill Captaincy Records: గాలే వేదికగా శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలను మరింత సజీవం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన టెస్టు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనతను తన తొలి పది మ్యాచ్‌ల్లోనే అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యం కాలే.. అరుదైన రికార్డులో శుభ్మన్ గిల్.. అదేంటంటే?
Gill Records
Venkata Chari
|

Updated on: Aug 19, 2026 | 5:47 PM

Share

Shubman Gill Captaincy Records: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన టీమ్‌ఇండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక 284 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేసి 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. మానవ్ సుతార్ 6/55తో చెలరేగి విజయాన్ని ఖాయం చేశాడు.

కోహ్లీ, రోహిత్‌ను వెనక్కి నెట్టిన గిల్..

ఈ విజయంతో శుభ్‌మన్ గిల్ తన తొలి 10 టెస్టుల్లో ఆరో గెలుపు అందుకున్నాడు. దీంతో తొలి పది మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత టెస్టు కెప్టెన్ల జాబితాలో గిల్ రెండో స్థానానికి చేరాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ తొలి పది టెస్టుల్లో చెరో ఐదు విజయాలు సాధించారు. గిల్ మాత్రం ఆ సంఖ్యను ఆరుకు పెంచి ఇద్దరినీ అధిగమించాడు. భారత టెస్టు కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన సౌరవ్ గంగూలీ రికార్డును గిల్ సమం చేశాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!

ఇవి కూడా చదవండి

గిల్ ముందు ఇప్పుడు ధోనీ..

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది మహేంద్ర సింగ్ ధోనీ. భారత టెస్టు కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌ల్లో ధోనీ ఏడు విజయాలు సాధించాడు. దీంతో గిల్ ఇప్పుడు ధోనీ రికార్డుకు ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.

2025లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో గిల్ భారత టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన తర్వాత వెస్టిండీస్‌ను 2-0తో ఓడించాడు. అఫ్గానిస్థాన్‌పై ఏకైక టెస్టులోనూ భారత్ గెలిచింది.

WTC ఫైనల్ రేసులో భారత్‌కు కీలక గెలుపు..

గాలే విజయం WTC 2027 రేసులో భారత్‌కు కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో 53.55 శాతం పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. ఫైనల్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాల్సిన అవసరం ఉంది.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, అనంతరం 2027లో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ భారత్ ఆడనుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. కోహ్లీ, రోహిత్‌లను దాటిన గిల్‌కు ఇప్పుడు ధోనీ రికార్డును అందుకోవడం తదుపరి లక్ష్యంగా మారింది.

కెప్టెన్‌గా తనదైన మార్క్ చూపిస్తున్న శుభ్‌మన్ గిల్ రికార్డుల వేటలో దూసుకుపోతున్నాడు. విరాట్, రోహిత్ లాంటి సీనియర్ల రికార్డులు బద్దలు కొట్టడం అతని నాయకత్వ పటిమకు అద్దం పడుతోంది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తే భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గిల్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us