AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వాసులకు బిగ్ అప్‌డేట్.. అధికారుల దృష్టికి నేరుగా పౌర సమస్యలు.. వాట్సాప్ నంబర్ ఇదే!

హైదరాబాద్ వాసుల పౌర సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కొత్త వాట్సాప్ కార్యక్రమం ప్రారంభించింది. 90634 21347 నంబర్‌కు పారిశుధ్యం, రోడ్లు, ఆస్తి పన్ను వంటి సమస్యలను ఫోటోలు, లొకేషన్‌తో సహా పంపవచ్చు. అధికారులు ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హైదరాబాద్ వాసులకు బిగ్ అప్‌డేట్.. అధికారుల దృష్టికి నేరుగా పౌర సమస్యలు.. వాట్సాప్ నంబర్ ఇదే!
Cmc Hyderabad
Balaraju Goud
|

Updated on: Oct 01, 2026 | 11:34 AM

Share

హైదరాబాద్ వాసులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కీలక అవకాశం కల్పించింది. నగరంలోని పౌర సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాట్సాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. CMC కమిషనర్ జి. సృజన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. 76 డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు.

పారిశుధ్యం, రోడ్ల పరిస్థితి, పార్కుల నిర్వహణ, వరద కాలువలు, చెత్త తొలగింపు, వీధి దీపాలు, ఆస్తి పన్ను, వివిధ సర్టిఫికెట్లకు సంబంధించిన సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా నివేదించవచ్చు. అలాగే అసురక్షిత భవనాలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా అధికారులు స్వీకరించనున్నారు.

ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ ‘‘90634 21347’’కు పంపాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసే సమయంలో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను స్పష్టంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. వీలైతే సమస్య ఉన్న ప్రదేశానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్‌తో పాటు ఫోటోలు లేదా వీడియోలను కూడా పంపాలి. దీంతో సమస్య ఉన్న ప్రాంతాన్ని అధికారులు సులభంగా గుర్తించి, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ వాట్సాప్ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పౌర సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అక్టోబర్ 7 వరకు ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. నగరంలో ఏదైనా పౌర సమస్య ఉంటే.. ఇక కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా వాట్సాప్‌లో ఫిర్యాదు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us