RR vs MI: వేలంలో హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు.. కట్‌చేస్తే.. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి ఫిఫర్‌తో పిచ్చెక్కించాడు..

Best bowling figures in IPL 2024: సందీప్ శర్మ 119 ఐపీఎల్ మ్యాచ్‌లలో 130 వికెట్లు పడగొట్టాడు. అయితే, రెండేళ్ల క్రితం ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా అతనిని కొనుగోలు చేయలేదు. మ్యాచ్ ఫలితం తర్వాత సందీప్ శర్మ తన ఆట గురించి, ఐపీఎల్ గురించి బహిరంగంగా మాట్లాడాడు. రెండేళ్ల క్రితం వేలంలో తనను ఎవరూ తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.

RR vs MI: వేలంలో హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు.. కట్‌చేస్తే.. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి ఫిఫర్‌తో పిచ్చెక్కించాడు..
Sandeep Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2024 | 8:06 AM

Sandeep Sharma Five-Wicket Haul: ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్షంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడంలో సందీప్ శర్మ హీరోగా నిలిచాడు. ఐపీఎల్‌లో 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ముంబై జట్టు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వి జైస్వాల్ రెండో సెంచరీ ఆధారంగా 18.4 ఓవర్లలో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఫలితం తర్వాత సందీప్ శర్మ తన ఆట గురించి, ఐపీఎల్ గురించి బహిరంగంగా మాట్లాడాడు. రెండేళ్ల క్రితం వేలంలో తనను ఎవరూ తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.

సందీప్ శర్మ 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 130 వికెట్లు తీశాడు. కానీ, 2022 మెగా వేలంలో అతనిపై ఎవరూ బెట్టింగ్‌లు వేయలేదు. ఐపీఎల్ 2023లో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అతనిని రాజస్థాన్ తీసుకుంది. అప్పటి నుంచి ఈ బౌలర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అనేక సందర్భాల్లో రాజస్థాన్‌కు ట్రబుల్ షూటర్‌గా నిలిచాడు. సందీప్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో వేలంలో ధర రాలేదన్న అతని బాధ బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం నేను వేలంలో అమ్ముడుపోలేదు. ప్రత్యామ్నాయంగా వచ్చాను. కాబట్టి ప్రతి మ్యాచ్ నాకు బోనస్, నేను దానిని ఆస్వాదిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సందీప్..

30 ఏళ్ల సందీప్ గాయపడిన కారణంగా రాజస్థాన్‌లోని గత కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ‘గాయం నయమైంది. ఫిట్‌నెస్‌ పుంజుకున్న తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. నేను ఇష్టపడుతున్నాను. పిచ్ నిదానంగా ఉంది. కాబట్టి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంచి కట్టర్‌లను ఉపయోగించాలనేది నా ప్రణాళిక. చివరి ఓవర్లలో బౌలింగ్ చేస్తే పెద్ద మనసు ఉండాలి. బౌలర్లు ఒత్తిడికి లోనవడం ఐపీఎల్‌లో కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఎంతో ఓర్పు కలిగి ఉండాలి. వైవిధ్యాన్ని అమలు చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో సందీప్ సక్సెస్..

రాజస్థాన్ కంటే ముందు సందీప్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బౌలర్లలో అతను ఒకడు. సందీప్ శర్మ T20 క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు.

IPL 2024లో ఇప్పటివరకు సందీప్ 5/18తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే ఈ సీజన్‌లో బౌలర్లు ఇప్పటి వరకు మూడోసారి 5 వికెట్లు పడగొట్టారు.

IPL 2024లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు..

1) సందీప్ శర్మ – 5/18 – RR vs MI

2) జస్ప్రీత్ బుమ్రా – 5/21 – MI vs RCB

3) యష్ ఠాకూర్ – 5/30 – LSG vs GT

4) టి నటరాజన్ – 4/19 – DC vs SRH

5) మతీష పతిరన – 4/28 – MI vs CSK

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..