AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చివరి ఓవర్లో విజయానికి 3 పరుగులు.. ఆఖరి బంతి వరకు ఫుల్ హైడ్రామా.. సీన్ కట్‌చేస్తే..

SA20 League: ముంబై ఇండియన్స్ కేప్ టౌన్‌ను చివరి ఓవర్లో, చివరి బంతికి ఓడించి, ప్రిటోరియా క్యాపిటల్స్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.

Watch Video: చివరి ఓవర్లో విజయానికి 3 పరుగులు.. ఆఖరి బంతి వరకు ఫుల్ హైడ్రామా.. సీన్ కట్‌చేస్తే..
Sa20 League Pretoria Capita
Venkata Chari
|

Updated on: Feb 05, 2023 | 11:44 AM

Share

టీ20 మ్యాచ్‌ల్లో ఉత్కంఠ ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే, కొన్ని మ్యాచులు చప్పగా సాగినా.. చాలా మ్యాచ్‌లు మాత్రం.. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి వినోదంతోపాటు ఉత్కంఠను కలిగిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ మ్యాచ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు ఫుల్ డ్రామా, యాక్షన్, థ్రిల్ కనిపించింది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో జరిగింది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో గెలిచింది. అయితే ఈ విజయం వెనుక ఉన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసింది.

నిజానికి ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లోనే కాకుండా చివరి బంతి వరకు సాగింది. చివరి ఓవర్‌లో రావాల్సిన పరుగులు కూడా చివరి బంతి వరకు వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది.

రాసి వాన్ డెర్ డస్సెన్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తొలి బ్యాటింగ్ చేసింది. పూర్తి 20 ఓవర్లు ఆడడంలో విఫలమైంది. ముంబై జట్టు 19.4 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నుంచి రాసి వాన్ డెర్ డస్సెన్ అత్యధిక పరుగులు చేశాడు. ఓపెనింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాసి 29 బంతుల్లో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రిలే ఎదురుదాడి, చివరి ఓవర్‌ వరకు చేరిన ఫలితం..

ప్రిటోరియా క్యాపిటల్స్‌కు 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ రిలే రస్సో 19 బంతుల్లో 40 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ బ్యాట్స్‌మెన్ రాసి వాన్ డెర్ డస్సెన్ దాడికి బదులిచ్చాడు. 210కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ రిలే 4 సిక్సర్లు కూడా కొట్టాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా, మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లింది. అక్కడ ప్రిటోరియా విజయానికి 6 బంతుల్లో 3 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.

6 బంతులు, 3 పరుగులు..

ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలర్ సామ్ కరణ్ చేతిలో బంతి ఉంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌కు చెందిన వేన్ పార్నెల్ స్ట్రైక్‌లో ఉన్నాడు. తొలి బంతికి పరుగు లేదు. రెండో బంతికి పార్నెల్ సింగిల్ తీశాడు. మూడో బంతికి స్ట్రయిక్‌లోకి వచ్చిన ముత్తుసామిని కరణ్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు స్ట్రైక్‌లో ఉన్న కొత్త బ్యాట్స్‌మన్ జాస్ లిటిల్. నాలుగో బంతికి పరుగు లేదు. ఐదో బంతి కూడా నో రన్. ఆరో, చివరి బంతికి లిటిల్ బంతిని కొట్టి విజయానికి అవసరమైన 2 పరుగులు పూర్తి చేశాడు. ఈ విధంగా, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్‌ను ఓడించి, ప్రిటోరియా క్యాపిటల్స్ చివరి బంతికి 1 వికెట్ తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!