Vinod Kambli: మరో వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్.. భార్యను కొట్టిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు..
Vinod Kambli Controversy: బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినోద్ కాంబ్లీపై ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు.
FIR on Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి కష్టాలు మళ్లీ పెరిగాయి. ఈసారి భార్యపై దాడి చేయడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. మద్యం తాగి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, దాడి చేశాడని భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంబ్లీకి సంబంధించిన విషయం పోలీసులకు చేరడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాంబ్లీపై ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు. కాంబ్లీ తన భార్యపై వంట చేసే పాన్ విసరడంతో.. ఆమె తలకు గాయమైందని ఆరోపణలు వచ్చాయి. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో భార్యతో గొడవ..
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం, కాంబ్లీ తన బాంద్రా ఫ్లాట్‌కి మద్యం మత్తులో వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో కాంబ్లీ, అతని భార్య మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో కాంబ్లీ తన భార్యను దుర్భాషలాడాడు. ఇదంతా పక్కనే ఉన్న అతని 12 ఏళ్ల కొడుకు తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవను చూసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ గొడవ కేవలం దూషణలకే పరిమితం కాలేదు. ఆ తర్వాత కాంబ్లీ వంటగదిలోకి వెళ్లి వంటపాన్‌ను తీసుకుని భార్యపై దాడి చేశాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ముందు కాంబ్లీ భార్య భాభా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుందని పోలీసులు తెలిపారు.
గతంలోనూ పలు వివాదాల్లో..
మద్యం మత్తులో భార్యపై దాడికి పాల్పడిన వినోద్ కాంబ్లీని గతేడాది ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మద్యం మత్తులో ఓ కారును ఢీకొట్టాడు.
1990వ దశకంలో వినోద్ కాంబ్లీ భారత జట్టులో చోటు సంపాదించి చాలా కాలం పాటు జట్టులో భాగమయ్యాడు. భారతదేశం తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. కాంబ్లీ పేరుతో 3500 కంటే ఎక్కువ పరుగులు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..