IND vs AUS: అసలు పోరు ఈ కీలక ఆటగాళ్ల మధ్యే.. హీట్ పెంచిన ఐసీసీ.. లిస్టులో ఎవరున్నారంటే?

India vs Australia: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ముందు ఐసీసీ మరింత హీట్ పెంచేసింది. అసలు యుద్ధం ఇరు దేశాలది కాదని, ఈ 10మంది ఆటగాళ్ల మధ్యే అసలు సిసలైన పోరు కనిపిస్తుందని తెల్చేసింది.

IND vs AUS: అసలు పోరు ఈ కీలక ఆటగాళ్ల మధ్యే.. హీట్ పెంచిన ఐసీసీ.. లిస్టులో ఎవరున్నారంటే?
Ind Vs Aus Test Series
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2023 | 9:59 AM

Border-Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో మొదలుకానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్ట్యా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకమైనది. అదే సమయంలో ఐసీసీ ఈ కీలక టోర్నీకి ముందు టీమిండియా, ఆస్ట్రేలియా నుంచి 10 మంది ప్లేయర్లను ఎంచుకుంది. వీరి మధ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికర పోరు చూడొచ్చంటూ ప్రకటించింది. ఐసీసీ ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్ వంటి కీలక పేర్లు ఉన్నాయి.

ఈ ఆటగాళ్ల మధ్యే యుద్ధం..

విరాట్ కోహ్లి vs నాథన్ లియాన్

రోహిత్ శర్మ vs పాట్ కమిన్స్

చెతేశ్వర్ పుజారా vs జోష్ హాజిల్‌వుడ్

రవి అశ్విన్ vs డేవిడ్ వార్నర్

రవీంద్ర జడేజా vs స్టీవ్ స్మిత్

నాగ్‌పూర్‌లో తొలి టెస్ట్..

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగ్‌పూర్‌లో జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ధర్మశాలలో జరగనుంది. అదే సమయంలో మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియా వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి భారత జట్టు సిరీస్‌ను గెలుచుకుంది.