Test Cricket: బౌలర్ దెబ్బకు క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్స్.. 10 వికెట్లతో భయాందోళనలు.. ఎవరో తెలుసా?

వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో లీవార్డ్ ఐలాండ్స్ వర్సెస్ జమైకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ క్రికెటర్లలో ఒకరైన రహ్కీమ్ కార్న్‌వాల్ 100 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు.

Test Cricket: బౌలర్ దెబ్బకు క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్స్.. 10 వికెట్లతో భయాందోళనలు.. ఎవరో తెలుసా?
Rahkeem Cornwall
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2023 | 11:55 AM

వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో లీవార్డ్ ఐలాండ్స్ వర్సెస్ జమైకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ క్రికెటర్లలో ఒకరైన రహ్కీమ్ కార్న్‌వాల్ 100 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు.

ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో, రహ్కీమ్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లను కలిపి తన 10 వికెట్లు సాధించాడు. అయితే, బంతితో ప్రకంపనలు సృష్టించకముందే బ్యాటింగ్‌లోనూ దంచేశాడు. లీవార్డ్ ఐలాండ్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసిన తర్వాత ఆలౌట్ అయింది. రహ్కీమ్ 29 పరుగులు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే 5 వికెట్లు..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమైకా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. జమైకాపై లీవార్డ్ ఐలాండ్ బౌలర్ రహ్కీమ్ కార్న్‌వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రహ్కీమ్ బంతితో సృష్టించిన ఈ తిరుగుబాటు కారణంగా లీవార్డ్ ఐలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇవి కూడా చదవండి

రెండో ఇన్నింగ్స్‌లో రహ్కీమ్ 41 పరుగులకే 5 వికెట్లు..

లీవార్డ్ ఐలాండ్ రెండో ఇన్నింగ్స్ 241 పరుగులు చేసింది. ఇందులో రహ్కీమ్ కార్న్‌వాల్ బ్యాట్‌తో 85 పరుగులు చేశాడు. దీంతో జమైకా జట్టు 268 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ, జమైకా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితం డ్రాగా ముగిసింది.

మ్యాచ్‌లో 95 పరుగులకే 10 వికెట్లు..

లీవార్డ్ దీవులకు రెండో ఇన్నింగ్స్‌లో రహ్కీమ్ మరోసారి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈసారి 41 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా, అతను మ్యాచ్‌లో 95 పరుగులు చేసి మొత్తం 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే