India vs Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన స్టార్ బౌలర్..
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి సిరీస్‌కు సిద్ధమైంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది.
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభం కావడానికి నాలుగు రోజుల సమయమే ఉంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు నాగ్‌పూర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తోంది. సోమవారం నాగ్‌పూర్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే, నాగ్‌పూర్ చేరుకోకముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ లేకుండా ఆస్ట్రేలియా జట్టు ఆడటం అంత తేలికైన నిర్ణయం కాకపోవచ్చు.
గత నెలలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ ఎడమ కాలికి గాయమైంది. బెంగుళూరులో జరిగిన క్యాంపులో చురుగ్గా కనిపించలేదు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా అతడికి తొలి టెస్టు మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
హేజిల్‌వుడ్ మిస్..
హాజిల్‌వుడ్‌తో పాటు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రేమ్ కూడా గాయంతో బాధపడుతున్నారు. ఆదివారం, హేజిల్‌వుడ్‌ను గాయం గురించి మాట్లాడుతూ, ‘నేను మొదటి టెస్ట్‌లో ఆడటం కష్టమే. రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటాను. ప్రస్తుతం పనిభారాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను బాగా కోలుకోలేకపోతున్నాను. ముందుగా కాస్త బ్యాటింగ్ చేసి నాగ్‌పూర్ వెళ్లి బౌలింగ్ చేస్తానని అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
బౌలాండ్‌కు అవకాశం..
జోష్ హేజిల్‌వుడ్ నిష్క్రమణతో ఇప్పుడు స్కాట్ బౌలాండ్‌కి విదేశీ గడ్డపై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. బౌలాండ్ ఆస్ట్రేలియా తరపున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. బౌలాండ్ గురించి హేజిల్‌వుడ్ మాట్లాడుతూ, ‘మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఫ్లాట్ వికెట్‌పై స్కాటీ చాలా బౌలింగ్ చేశాడు. బంతి పెద్దగా స్వింగ్ కాలేదు. కష్టపడి పనిచేయాలని అతనికి తెలుసు. స్కాట్‌తో పాటు, లాన్స్ మారిస్ కూడా ఆస్ట్రేలియా జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..