IND vs AUS: టీమిండియా ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు.. రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరంటే?

Ind vs Aus 1st Test Playing 11: ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకపోతున్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ మాత్రం పేలవమైన ఫాంతో తంటాలు పడుతున్నాడు.

IND vs AUS: టీమిండియా ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు.. రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరంటే?
Indian Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2023 | 12:53 PM

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో ఫుల్ బిజీగా మారాయి. అయితే, తొలి టెస్టులో బరిలోకి దిగే ప్లేయింగ్ 11పై తీవ్రంగా చర్చ నడుస్తోంది. టీమిండియా ప్లేయింగ్-11లో ఊహాగానాలు ముఖ్యంగా ఓపెనింగ్ జోడీపైనే ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయవచ్చని పలువురు మాజీ క్రికెటర్లు చెప్పుకొచ్చారు. గిల్ ఇటీవలి అద్భుతమైన ఫామ్ ఆధారంగానే, ప్రమోషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో కేఎల్ రాహుల్ ఆర్డర్ మారనుంది.

ప్రస్తుతం శుభమాన్ గిల్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో అతని బ్యాటింగ్ యావరేజ్ చూస్తే.. ప్రస్తుతం గిల్ ఫాం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే టీ20 క్రికెట్‌లో కూడా ఈ బ్యాట్స్‌మన్ ఇటీవల సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా రాణించాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను ఓపెనింగ్ పెయిర్ విషయంలో కేఎల్ రాహుల్‌ను వెనక్కునెట్టే ఛాన్స్ ఉంది.

శుభ్‌మన్ గిల్ ఇటీవలి 12 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల (T20I, ODI, Test) గురించి మాట్లాడితే, 76.90 బ్యాటింగ్ సగటుతో 769 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, 4 సెంచరీలు ఉన్నాయి. మరోవైపు, కేఎల్ రాహుల్ ప్రస్తుతం పేలవమైన ఫాంతో తంటాలుపడుతున్నాడు. గత 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 28.90 సగటుతో 318 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ల ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు ఇప్పటికే ఓపెనింగ్ జోడీపై ఓ క్లారిటికి వచ్చినట్లు సమాచారం. కేఎల్ రాహుల్ కంటే శుభ్‌మాన్ గిల్‌పైనే నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది.

మిడిలార్డర్‌లోనైనా కేఎల్ రాహుల్ ఆడేనా?

కేఎల్ రాహుల్ ఇటీవల వన్డే సిరీస్‌లో 5వ స్థానంలో ఆడుతున్నాడు. ఓపెనర్‌గా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోవడంతో డిమోషన్ ఇచ్చినట్లు సమాచారం. 5వ స్థానంలో బరిలోకి దిగి కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో ఆస్ట్రేలియాపై 5వ స్థానంలో కనిపించే అవకాశం ఉంది. అయితే, ఈ స్థానానికి సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. మరి తొలి టెస్టులో భారత జట్టు ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!