T20 Cricket: 4 ఓవర్లలో 15 పరుగులు.. 4 వికెట్లతో రెచ్చిపోయిన బాస్కెట్‌బాల్ ప్లేయర్.. తాత అడుగుజాడల్లో ముందుకు..

తాత అడుగుజాడల్లో నడిచిన లోగాన్.. నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందు న్యూజిలాండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. 2010 సంవత్సరంలో అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే అండర్ 19 బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో..

T20 Cricket: 4 ఓవర్లలో 15 పరుగులు.. 4 వికెట్లతో రెచ్చిపోయిన బాస్కెట్‌బాల్ ప్లేయర్.. తాత అడుగుజాడల్లో ముందుకు..
Logan Van Beek
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2023 | 1:20 PM

మనం సాధారణంగా తండ్రి అడుగుజాడల్లో నడిచిన వారిని చాలామందినే చూశాం. అయితే, ఓ ప్లేయర్ మాత్రం తన తాతను అనుసరించి, సత్తా చాటాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చల్లోకి వచ్చేశాడు. నెదర్లాండ్స్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే లోగాన్ బెయిన్ బీక్ గురించే ప్రస్తుతం చెబుతున్నాం. ఈ 32 ఏళ్ల లోగాన్ న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నమెంట్‌లో అద్బుత ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. కేవలం 15 పరుగులే ఇచ్చి 4గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చి వార్తల్లో నిలిచాడు.

లోగాన్ బెయిన్ బీక్ అనే ఈ ప్లేయర్ గుల్లెన్ మనవడు. గుల్లెన్ వెస్టిండీస్, న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడాడు. తాత అడుగుజాడల్లో నడిచిన లోగాన్.. నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందు న్యూజిలాండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. 2010 సంవత్సరంలో అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే అండర్ 19 బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 4 వికెట్లు..

ప్రస్తుతం లోగాన్ బెయిన్ బీక్ సూపర్ స్మాష్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్ స్మాష్‌లో ఆక్లాండ్ వర్సెస్ వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆక్లాండ్ 18 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. వెల్లింగ్టన్ తరపున లోగాన్ 15 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఓపెనర్ జార్జ్ వర్కర్‌ని తొలి వికెట్‌గా పెవిలియన్ చేర్చిన లోగాన్ బెయిన్ బీక్.. ఆ తర్వాత కైల్ జేమీసన్‌ వికెట్‌ పడగొట్టాడు. కాగా మూడో వికెట్‌గా ఆక్లాండ్ కెప్టెన్ ఔట్ చేశాడు. నాలుగో వికెట్‌గా లూయిస్ డెల్పాట్‌ను పెవిలియన్ చేర్చాడు.

అయితే, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ సూపర్ స్మాష్‌లో బంతితో విజయం సాధించాడు. కానీ, అతని జట్టు విజయాన్ని నమోదు చేయడంలో విఫలమైంది. డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..