AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాక్‌.. క్రికెట్‌ మైదానంలోకి రాళ్ల వర్షం.. మ్యాచ్‌ నిలిపివేత

పాకిస్తాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఆదివారం క్వెట్టా నగరంలోని మూసా చౌక్‌లో బాంబు పేలుడు సంభవించింది. దీంతో అక్కడ తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భాగంగా క్వెట్టా వేదికగా బాబర్‌ అజామ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది

Pakistan: మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాక్‌.. క్రికెట్‌ మైదానంలోకి రాళ్ల వర్షం.. మ్యాచ్‌ నిలిపివేత
Babar Azam, Sarfaraz
Basha Shek
|

Updated on: Feb 05, 2023 | 4:34 PM

Share

పాకిస్తాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఆదివారం క్వెట్టా నగరంలోని మూసా చౌక్‌లో బాంబు పేలుడు సంభవించింది. దీంతో అక్కడ తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భాగంగా క్వెట్టా వేదికగా బాబర్‌ అజామ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. బాంబు పేలుళ్ల తర్వాత కొందరు దుండగులు మైదానంలోకి రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పటించారు. దీంతో నిర్వాహకులు ఆటను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుత నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే బాంబు పేలుడు కారణంగా ఆటగాళ్లకు ఎలాంటి హాని జరగలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. క్వెట్టాలోని బుగట్టి స్టేడియంలో సర్ఫరాజ్ అహ్మద్‌కు చెందిన క్వెట్టా గ్లాడియేటర్స్, బాబర్ ఆజం పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే సమయంలో అప్పుడు అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్‌ను నిలిపేయాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్ కోసం 13000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే మ్యాచ్‌ కోసం 4000 మందికి పైగా భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే ఈ మ్యాచ్‌ని చూసేందుకు షాహిద్ అఫ్రిది, మొయిన్ ఖాన్, జావేద్ మియాందాద్ తదితర ప్రముఖులు కూడా క్వెట్టా చేరుకున్నారు. దీంతో పాటు పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా స్టేడియంలో ఉన్నారు.

కాగా క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎవరైనా చనిపోయారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే పేలుడు ఎలా సంభవించిందనే దాని మీద పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలే పెషావర్ సిటీలోని ఓ మసీదులో భారీ బాంబు పేలుడు జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో దాదాపుగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరువక ముందే పాక్‌లో మరో బాంబ్‌బ్లాస్ట్‌ చోటు చేసుకుంది. అయితే పేలుడు కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయలేదని, గ్రౌండ్ లోకి కొందరు వ్యక్తులు బయటి నుంచి రాళ్లు విసరడంతో మధ్యలోనే మ్యాచ్ ను ఆపేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మ్యాచ్ నిలిపివేయడానికి స్పష్టమైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి